ఇష్టారాజ్యం..!
అక్రమ నిర్మాణాలపై చర్యలు శూన్యం
●
ఉపేక్షించేది లేదు
అక్రమ నిర్మాణాలు, కబ్జాలను ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించేది లేదు. ప్రజా అవసరాల కోసం ఇచ్చిన పది శాతం స్థలాల్లో చేపడుతున్న నిర్మాణాలపై కఠినంగా వ్యవహరిస్తాం. ఇప్పటికే కొన్ని అక్రమ నిర్మాణదారులకు నోటీసులు జారీ చేశాం. స్పందించకుంటే కఠిన చర్యలు తప్పవు. వీటిపై కలెక్టర్ సీరియస్‌గా ఉన్నారు. ఆ దిశగానే చర్యలు ఉంటాయి.
– దశరథ్, కమిషనర్, గద్వాల
అధికారుల ద్వంద్వ వైఖరి?
గత కొంత కాలంగా మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లడం మానేశారు. దీంతో రాజకీయ, అంగబలం ఉన్న వారు నిబంధనలు ఉల్లంఘించి, అనుమతులు లేకుండా, మున్సిపల్ స్థలాన్ని కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. అక్రమ కట్టడాలు, మున్సిపల్ స్థలాల కబ్జాలపై ఆధారాలతో ఫిర్యాదు చేశారు. వాటిపై చర్యలు తీసుకోలేదు. కనీసం విచారణ సైతం చేపట్టలేదు. దీంతో మున్సిపల్ అధకారుల పనితీరుపై విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలను ఉదహరిస్తున్నారు. బసవన్న చౌరస్తాలో అక్రమంగా నిర్మించిన దుకాణాలను రాత్రికి రాత్రే పోలీసు బందోబస్తుతో కూల్చేశారు. అదే సందర్భంగా కుంటవీధిలోని పదిశాతం ప్రజా అవసరాల స్థలాన్ని ఫోర్జరీ సంతకాలతో కబ్జా చేసి చేపట్టిన భవన నిర్మాణంపై చర్యలు తీసుకోలేదు. అధికార పార్టీ నేత నుంచి బెదరింపు ఫోన్ రావడంతో అక్రమ నిర్మాణంపై కూల్చివేయడానికి వెళ్లిన అధికారులు వెనుదిరిగారు. ఇప్పటి వరకు చర్యలు తీసుకోవడానికి తాత్సరం చేస్తున్నారు. అధికారుల ద్వంద వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణాలు, మున్సిపల్ స్థలాల కబ్జాలపై కొరఢా ఝులిపించాలని స్థానికులు కొరుతున్నారు.
గద్వాలటౌన్: కలెక్టర్ ఆదేశించినా జిల్లాలో మాత్రం ఈ విషయం అడుగులు ముందుకు పడటం లేదు. కబ్జాలు, అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించినా.. కూల్చివేతలు చేపట్టలేదు. నామమాత్రపు హెచ్చరికలతో చేతులు దులుపుకొన్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలో అదే తీరు నెలకొంది. కలెక్టర్, అడిషినల్ కలెక్టర్లు నివాసం ఉంటున్న జిల్లా కేంద్రంలో అంతా ఇదే తీరు కనిపిస్తుంది. అధికారికంగానే వందకు పైగా అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే అనధికారికంగా రెట్టింపు సంఖ్యలో అక్రమ కట్టడాలు ఉన్నాయి.
మీనమేషాలు లెక్కింపు
జిల్లాలో గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో అలంపూర్ మినహా మిగిలిన మూడు మున్సిపల్ పట్టణాలు వాణిజ్య పరంగా దినదినాభివృద్ధి చెందుతున్నాయి. ప్రధానంగా జిల్లా కేంద్రమైన గద్వాలలో భవన యజమానులు, బిల్డర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ భారీ భవంతులను నిర్మిస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాలు అధికారులకు కళ్ల ముందు కనిపిస్తున్నా.. చర్యలు తీసుకోవడం లేదు. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించిన అధికారులు వాటి యజమానులకు నోటీసులు ఇవ్వడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. మున్సిపాలిటీ రూ.లక్షల్లో ఆదాయం కోల్పోతున్నా పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై మక్కువ చూపడంలో అంతర్యమేమిటో అర్థం కావడం లేదు. సామాన్యులపై ప్రభావం చూపే టౌన్ ఫ్లానింగ్ అధికారులు అక్రమ కట్టడాలు ఏర్పాటు చేస్తున్న యజమానుల జోలికి వెళ్లడం లేదు. ముఖ్యంగా కొంత మంది నాయకులకు అక్రమ నిర్మాణాలు కాసులు కురిసిస్తున్నయనేది బహిరంగ రహస్యం. పార్టీలకు అతీతంగా కొంతమంది నేతలు వసూళ్లలో మునిగితేలుతున్నారు. ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని పనిచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
కలెక్టర్ చొరవ చూపితే మేలు
కలెక్టర్, అదనపు జిల్లా కలెక్టర్లు మున్సిపాలిటీలపై ప్రత్యేకశ్రద్ధ కనబరుస్తున్నారు. మున్సిపల్ పాలనతో పాటు ఆదాయ వనరుల సమీకరణ, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టిసారించి, ఆ దిశగా అధికారులను దిశానిర్ధేశం చేశారు. అదేవిధంగా మున్సిపల్ పట్టణాలలో సాగుతున్న అక్రమ నిర్మాణాలు, కబ్జాలు, అనధికారిక వెంచర్ల బాగోతంపై వారు దృష్టి సారించాలి. సామాన్య ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నా.. సంబంధిత అధికారులు మాత్రం ఈ విషయాన్ని కలెక్టర్ల దృష్టికి తీసుకువెళ్లడం లేదు. రాజకీయంగా ఒత్తిడి వచ్చినా లెక్క చేయక వాటిని కూల్చేయాలి. స్థానిక నాయకులు వారికి సహకారం అందించాలి. ముఖ్యంగా గద్వాలలోని అభివృద్ధి చెందుతున్న కాలనీలలోనే అక్రమ నిర్మాణాలు, కబ్జాలు పెద్ద సంఖ్యలో వెలుగు చూస్తున్నాయి.
మున్సిపల్ ఆదాయానికి
రూ.లక్షల్లో గండి
జిల్లా కేంద్రంలో అంతా అదే తీరు
ఒత్తిళ్లకు తలొగ్గుతున్న అధికారులు
‘జిల్లాలోని ఏ మున్సిపాలిటీల్లో కూడా కబ్జాలు, అక్రమ నిర్మాణాలను
ఉపేక్షించేది లేదు.. గుర్తించి వెంటనే నోటీసులు జారీ చేసి అక్రమ కట్టడాలను అడ్డుకోండి. అప్పటికీ వినకుంటే బాధ్యులపై చర్యలు తీసుకుని, ఆక్రమ నిర్మాణాలను కూల్చివేయండి..’ ఇటీవల జరిగిన సమీక్షలో మున్సిపల్
కమిషనర్లకు కలెక్టర్ సంతోష్ ఆదేశం
ఇష్టారాజ్యం..!
ఇష్టారాజ్యం..!
Comments
Please login to add a commentAdd a comment