ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు
గద్వాల: వివిధ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో సమావేశం హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు సమస్యలపై 30మంది ఫిర్యాదులు అందజేసిట్లు కలెక్టర్ తెలిపారు. వచ్చిన దరఖాస్తులను ఆయా శాఖలకు చెందిన అధికారులకు పంపినట్లు వాటిని వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్‌నాలెడ్డ్‌మెంట్ ద్వారా తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, ఆర్డీవో శ్రీనివాస్‌రావు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 10 అర్జీలు..
గద్వాల క్రైం: పోలీస్ గ్రీవెన్స్ కార్యక్రమానికి 10 ఫిర్యాదులు అందాయని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. గద్వాల– అలంపూర్ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన బాధితులు తమ సమస్యలపై వివరించారని, ఇందుల్లో భూ సంబంధ, సైబర్ మోసాలు, వేధింపులపై ఫిర్యాదులు అందాయన్నారు. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ బాధితులకు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment