నేడు పరమేశ్వరుని పరిణయోత్సవాలు
● పాదగయ క్షేత్రంలో శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి దివ్య క ల్యాణ మహోత్సవం సోమవారం రాత్రి 8.32 గంటలకు నిర్వహించనున్నారు. బుధవారం మహాశివరాత్రి ఉత్సవం, గురువారం మధ్యా హ్నం 3 గంటలకు నాకబలి, దండియాడింపు, దొంగలదోపు ఉత్సవాలు, రథోత్సవం నిర్వహిస్తారు. 28వ తేదీన త్రిశూల స్నానం, స్వా మివారి తెప్పోత్సవం, శ్రీపుష్పోత్సవంతో మహా శివరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి.
● సామర్లకోటలోని పంచారామ క్షేత్రమైన శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత శ్రీ కుమారారామ భీమేశ్వరస్వామి వారి కల్యాణోత్సవాన్ని కూడా సోమవారం రాత్రి 9.05 గంటలకు నిర్వహించనున్నారు. అమ్మవారిని, స్వామి వారిని శనివారమే వధూవరులుగా అలంకరించారు. పసుపు దంచి, పెళ్లి పనులు ప్రారంభించారు. ఆలయం వెనుకన ఉన్న తోటలో సర్వాంగసుందరంగా ముస్తాబు చేసిన వేదికపై స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఆలయానికి వచ్చిన భక్తులందరూ పరమేశ్వరుని కల్యాణోత్సవం తిలకించేలా ఆలయ ప్రాంగణంలో స్కీన్లు ఏర్పాటు చేశారు. కల్యాణోత్సవాల్లో భాగంగా గురువారం మధ్యాహ్నం రథోత్సవం, 28న త్రిశూల స్నానం నిర్వహిస్తారు. మార్చి 1వ తేదీ రాత్రి శ్రీ పుష్పయాగోత్సవంతో కల్యాణోత్సవాలు ముగుస్తాయి.
● ఇతర శివాలయాల్లో కూడా స్వామి వారి కల్యాణోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment