
సద్వినియోగం చేసుకోండి
విద్యార్థులు కలలను సాకారం చేసుకోవడానికి ఇది చక్కని అవకాశం. దీనిని అందిపుచ్చుకునేందుకు విద్యార్థులు ప్రయత్నించాలి. ఇస్రో పేర్కొన్న అర్హతలు కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకునేలా సైన్స్ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు ఇది మంచి మార్గం.
–జీవీఎస్ సుబ్రహ్మణ్యం,
జిల్లా సైన్స్ అధికారి, అమలాపురం
ఎంతో ఉపయుక్తం
యువికాకు అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి. శాస్త్రవేత్తలు కావాలనుకునే వారికి ఇది ఎంతో ఉపయుక్తం. ప్రశ్నించేతత్వమే ప్రయోగాలకు, శాస్త్రవేత్తలు కావడానికి కారణమవుతుంది. డీఈఓలు, డీవైఈఓలు, జిల్లా సైన్స్ అధికారులు, సైన్స్ టీచర్లు శ్రద్ధ తీసుకుని అధిక సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా చూడాలి.
–జి.నాగమణి,
ఆర్జేడీ, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ

సద్వినియోగం చేసుకోండి
Comments
Please login to add a commentAdd a comment