కరప: మండలం గొర్రిపూడిలోని జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎంపై వేధింపుల కేసు నమోదైంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటనపై స్థానికులు, విద్యార్థినులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గొర్రిపూడి జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం అడబాల కాశీవిశ్వేశ్వరరావు కొంతకాలంగా పదో తరగతి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, వేధిస్తున్నారు. విద్యాశాఖాధికారులు సైతం ఆయనపై వచ్చిన ఫిర్యాదులను పట్టించుకోకపోవడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి హెచ్‌ఎంపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్థానిక ఎస్‌ఐ టి.సునీత శనివారం ఆ పాఠశాలకు విచారణకు వెళ్లారు. అదే సమయంలో ఎంఈఓ కె.బుల్లికృష్ణవేణి పాఠశాల సందర్శనకు వెళ్లి తిరిగి వస్తుండగా ఎస్‌ఐ సునీత చూసి పలకరించగా చిన్న విచారణకు వచ్చామని చెప్పడంతో ఎంఈఓ వెళ్లిపోయారు. తరువాత ఎస్సై అక్కడి విద్యార్థినులను కలసి వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ విషయమై డీవైఈఓ ఎన్.వెంకటేశ్వరరావు సోమవారం పాఠశాలకు విచారణకు వస్తున్నట్టు తెలిసింది. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యుడిపై కఠినచర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
పోలీస్ కంట్రోల్ రూమ్‌కు
ఫిర్యాదు చేసిన విద్యార్థినులు
Comments
Please login to add a commentAdd a comment