ఫెన్సింగ్‌లో జాతీయస్థాయికి ‘లక్ష్య’ విద్యార్థులు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఈనెల ఒకటో తేదీన ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో జరిగిన 11వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ ఫెన్సింగ్ పోటీలలో స్థానిక లక్ష్య ఇంటర్‌నేషనల్ స్కూల్ విద్యార్థులు నల్లమిల్లి శేషు రిషిత్ రెడ్డి, ఆప్తి వర్ణిక శేఖర్ ప్రతిభ చూపి వ్యక్తిగత విభాగంలో జాతీయస్థాయికి ఎంపికయ్యారని పాఠశాల డైరెక్టర్ డాక్టర్ సుగుణ మంగళవారం తెలిపారు. జట్టు విభాగంలో రిషిత్ రెడ్డి బంగారు, ఆప్తి వర్ణికశేఖర్ రజత, భవ్య సహజ రెడ్డి రజత, బృహతి ఖడ్గ కాంస్య, బి.లక్ష్మీ కృతిక కాంస్య, ఆన్యజైన్ రజత, వర్ణిక రజత, కె.నిహాంత్ కాంస్య, విరాజ్ బంగారు, హితేష్ బంగారు పతకాలు గెలుచుకున్నారన్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులను ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి, లక్ష్య ఇంటర్‌నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ వందన బొహరా, కోచ్ సతీష్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment