సంక్షేమం నుంచి సంక్షోభం | - | Sakshi
Sakshi News home page

సంక్షేమం నుంచి సంక్షోభం

Published Sat, Mar 8 2025 12:09 AM | Last Updated on Sat, Mar 8 2025 12:10 AM

సంక్ష

సంక్షేమం నుంచి సంక్షోభం

కూటమి పాలనలో మహిళా ఉద్యమాలిలా..

కూటమి ప్రభుత్వం రాగానే మహిళా శ్రామికులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్రంగా దగాపడ్డారు. 8 నెలల వేతన బకాయిలు ఇవ్వాలని వీఓఏలు జనవరి 27, 28, 29లలో నిరసన కార్యక్రమాలు చేశారు. కోనసీమ జిల్లాలో 1,726, తూర్పుగోదావరి జిల్లాలో 1,556 అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో విస్తారంగా అంగన్‌వాడీలున్నారు. కాకినాడ జిల్లాలో సుమారు 3500 మంది అంగన్‌వాడీలు సేవలందిస్తున్నారు. వారంతా కూటమి సర్కార్‌ ఇచ్చిన హామీలుకు గత నెల 18న ఐసీడీఎస్‌ కార్యాలయాల ఎదుట ధర్నా చేశారు. అదే నెల 24న కాకినాడ కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట మున్సిపల్‌ కార్మికులు ధర్నాకు దిగారు. వలంటీర్లకు రూ.10వేలు గౌరవ వేతనమిస్తూ విధుల్లో చేర్చుకుంటామన్న కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ మూడు జిల్లాల్లో వివిధ స్థాయిల్లో ఆందోళన చేపట్టారు. పుట్టని బిడ్డకు పేరు ఎలా పెడతామంటూ ఒక మంత్రి, విధుల్లోకి తీసుకుంటే న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయంటూ మరో మంత్రి అనడంపై నిరసన వ్యక్తం చేశారు.

మహిళను మరచిన కూటమి సర్కార్‌

అడుగడుగునా అవమానాలు

హామీలన్నీ నీటి మూటలు

ప్రతి విషయంలో తప్పని ప్రతిఘటన

నిత్యం ఎదురవుతున్న ఉద్యమ నినాదాలు

ఆమెకు అందలం వేసిన జగన్‌ ప్రభుత్వం

కపిలేశ్వరపురం: అమ్మ గర్భంలో ఊపిరి తీసుకున్న బిడ్డ ఆ ఊపిరి ఉన్నతంతకాలం ఆమెకు రుణపడి బతకాల్సిందే. అమ్మగా, జీవిత భాగస్వామిగా, కుమార్తెగా బంధమేదైనా బతుకు ఆమెతోనే. సంపద సృష్టి నుంచి సమాజ ప్రగతి వరకు ఎంతో ప్రాధాన్యమున్న మహిళ గౌరవం, రక్షణ ఇవ్వడంలో ప్రభుత్వం శాసీ్త్రయ పద్ధతిని అనుసరించాలి. ఇది వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో కచ్చితంగా అమలైంది. అనంతరం వచ్చిన కూటమి సర్కార్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహిళలను దగా చేస్తూనే ఉన్నారు. అందుకు ప్రతిగా వారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు నిరసనలు చేస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెకు జరుగుతున్న అన్యాయంపై ప్రత్యేక కథనం.

ఉపాధి కరవు

ఉమ్మడి జిల్లాలో మహిళా విద్యా వంతులు ఎందరో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు ఉపాధి కల్పనపై ఎన్నో హామీలిచ్చి 9 నెలలు గడుస్తున్నా సమీక్షలు, సర్వేలు పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప ఒక్క నోటిఫికేషనూ విడుదల చేయలేదు. ఏటా జనవరి 1న జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామన్న హామీని తుంగలో తొక్కారు. అలాగే డీఎస్సీ ప్రకటించేస్తామని, 25 వేల పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటనలు గుప్పించేశారు. తీరా చూస్తే 16,347 ఖాళీ పోస్టులను చూపిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విద్యా శాఖ వెబ్‌సైట్‌లో కేవలం 1,146 మాత్రమే చూపిస్తున్నట్టు సమాచారం. జూలైలో నోటిఫికేషన్‌ ఇచ్చి, ఆగస్టులో పరీక్ష నిర్వహిస్తామన్న ప్రకటన అమలుకు నోచుకోలేదు. సుమారు 60 వేల మంది పోస్టుల భర్తీకై ఎదురు చూస్తున్నారు.

మహిళాభ్యుదయం గాలికి....

మహిళాభ్యుదయం కూటమితోనే సాధ్యమంటూ ఆ నేతలు ఉపన్యాసాలు ఊదరగొట్టారు. ఎస్సీ, బీసీ, మైనారిటీ మహిళలకు 50 ఏళ్లకే పింఛను అన్నారు. దాని ఊసే లేదు. కొత్త పింఛన్లు ఇస్తామని తొలగింపులకు దిగారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో వితంతు పింఛను లబ్ధిదారులు 49,906 మంది, ఒంటరి మహిళ పింఛను దారులు 4,557 ఉండగా తూర్పు గోదావరి జిల్లాలో వితంతు 64,376 మంది, ఒంటరి మహిళ పింఛను లబ్దిదారులు 9,107 మంది వైఎస్‌ జగన్‌ సర్కార్‌ నుంచి పింఛను పొదుతున్నారు. వాటిలో చాలా వరకు రద్దు చేస్తున్నారు. దివ్యాంగ పింఛన్ల సర్వే ఆ వర్గాల్లో ఆందోళన నింపుతోంది.

ఏరులైపారుతున్న మద్యం...

మద్యం ధరలు తగ్గిస్తామంటూ పురుషులను, నాణ్యతలేని మద్యం విక్రయిస్తూ మీ మగవారి ఆరోగ్యాలను వైఎస్సార్‌ సీపీ పాడుచేస్తోంది, మేలుకోండంటూ మహిళలను ఆకట్టుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుమతులు ఇచ్చి దండిగా ఆర్జిస్తున్నారు.

మహిళా ప్రగతికి బ్రాండ్‌ అంబాసిడర్‌ జగన్‌

వైఎస్‌ జగన్‌ సర్కార్‌ రాగానే ప్రైవేటు మద్యం దుకాణాలను రద్దు చేసింది. నిబంధనలను కఠినతరం చేస్తూ ప్రభుత్వం ద్వారా పరిమిత సంఖ్యలో మద్యం దుకాణాలకు అనుమతినిస్తూ మద్యం విక్రయాలను పరిమితం చేసింది. మహిహిళలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పెంచింది. ఊరికి ఒకటి నుంచి రెండు చొప్పున సచివాలయం, ఆర్‌బీకే, హెల్త్‌ సెంటర్‌లను ఏర్పాటు చేసి స్థానికంగానే మహిళకు ఉద్యోగాలిచ్చింది. కాకినాడ జిల్లాలో 620, కోనసీమలో 384, తూర్పుగోదావరిలో 512 సచివాలయాల్లో అత్యధిక సంఖ్యలో మహిళలకు ఉద్యోగాలు ఇచ్చింది. అక్క చెల్లెమ్మలకు రూ.5 లక్షలు విలువైన ఇంటి స్థలాన్ని అందజేసింది. తాజా ప్రభుత్వం వాటిని రద్దుచేసే యోచనలో ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో 431, కాకినాడ జిల్లాలో 241 లేఅవుట్లలో సుమారు 90 వేల ఇళ్ల పట్టాలను జగన్‌ సర్కార్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

రాజకీయ, సామాజిక రంగాల్లో..

గత ప్రభుత్వంలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ అమలు చేసింది. వైఎస్సార్‌ సీపీలో అంతకంటే ఎక్కువ శాతం పదవులను మహిళలకు కట్టపెట్టింది. దేశంలో తొలిసారిగా దళిత మహిళను హోమ్‌ మినిస్టర్‌ను చేసింది. శాసన మండలి చరిత్రలో తొలిసారిగా మైనారిటీ మహిళను డిప్యూటీ చైర్‌ పర్సన్‌ను చేసింది. దాదాపు స్థానిక ప్రజాప్రతినిధులు వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు కావడంతో క్షేత్ర స్థాయిలో నిర్వహిస్తున్న ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవకుండా అవమానిస్తున్న ఘటనలు అనేకం ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
సంక్షేమం నుంచి సంక్షోభం 1
1/2

సంక్షేమం నుంచి సంక్షోభం

సంక్షేమం నుంచి సంక్షోభం 2
2/2

సంక్షేమం నుంచి సంక్షోభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement