పాల దుకాణంపై ఫుడ్‌సేఫ్టీ అధికారుల దాడులు
బోట్‌క్లబ్: స్థానిక అచ్యుతాపురం రైల్వే గేటు సమీపంలోని శ్రీసాయి శ్రీనివాస్ మిల్క్ షాప్‌పై శుక్రవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. పాలు, పెరుగు నిల్వ ఉండడానికి స్పైడ్రైయ్ మిల్క్‌పౌడర్, బెంజోయాక్ యాసిడ్ వినిగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పాలు ఎక్కువ రోజు నిల్వ ఉంచేందకు ఈ యాసిడ్ వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పాలు తోడుపెట్టే క్రమంలో ఈ పౌడర్‌ను వినియోగిస్తున్నట్టు ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ కంట్రోలర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు నిర్వాహకునిపై కేసు నమోదు చేస్తున్నామన్నారు. ఇతని వద్ద స్వాధీనం చేసుకొన్న పాలు, పెరుగు ల్యాబ్‌కు పంపుతామన్నారు. ఇవి హానికరమని తేలితే మరో కేసు నమోదు చేస్తామన్నారు. పాలు, పెరుగు, రసాయనాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సుబ్బారావు తెలిపారు. యాసిడ్ వినియోగించి నిల్వ ఉంచి పాలు మనం తాగితే జీర్ణకోశ సమస్యలు వస్తాయని ఆయన తెలిపారు.
గొర్రిపూడి హెచ్‌ఎంపై పోక్సో కేసు
కరప: విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధింపులకు పాల్పడిన గొర్రిపూడి జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం అడబాల కాశీవిశ్వేశ్వరరావుపై పోక్సో కేసు నమోదైంది. అధికారుల విచారణలో ఫిర్యాదులు నిర్థారణ కావడంతో కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ సునీత శుక్రవారం తెలిపారు. కేసు విచారణలో ఉన్నందున నిందితుడిని అరెస్టు చేయలేదని, విచారణ నివేదికతో కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment