ప్రకృతి మాత ఒడిలో పని చేయడం ఆనందంగా ఉంది
నేను ఒక తల్లిగా ప్రకృతి మాత ఒడిలో పని చేయడం ఆనందంగా ఉంది. వ్యవసాయం ఆడవారు ఏమి చేస్తారు అనే వారే ఇప్పుడు ఏది చేసినా మీరే చేయాలి అంటూ ప్రశంసిస్తున్నారు. వ్యవసాయం అంతా రసాయనాల మయంగా మారిన తరుణంలో రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మరల్చడానికి మేము చేసిన ప్రయత్నం విజయవంతం అయ్యింది. అందరికీ ఆరోగ్యకరమైన పంటలను అందించడంలో మా పాత్ర ఉండడం చాలా గర్వంగా ఉంది.
– కర్రి సత్య, ప్రకృతి వ్యవసాయ శాఖ, ఐసీఆర్పీ, గుమ్మరేగల
ఉద్యోగంలా కాదు
ఉత్సాహంగా చేస్తున్నాం
ఆడవారికి వ్యవసాయం ఏమిటీ అనే పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయంలో అడుగు పెట్టాను. నాలుగేళ్లుగా ప్రకృతి వ్యవసాయ శాఖలో సీఆర్‌పీగా పని చేస్తూ ఎందరో రైతులకు సలహాలు ఇస్తూ వారితో పాటు పొలంలో పని చేస్తుండడం ఎక్కడ లేని ఆనందాన్నిస్తోంది. ఇది ఒక ఉద్యోగంలా కాకుండా ఉత్సాహంగా మనసు పెట్టి పని చేస్తున్నాం. మగ వారితో సమానంగా పొలాల్లో తిరుగుతూ భూమి సారవంతంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాం.
– సోమాల సునీత, ప్రకృతి వ్యవసాయ శాఖ సీఆర్పీ దుర్గాడ, గొల్లప్రోలు మండలం
చాలెంజ్‌గా పని చేస్తున్నా
మీకేం తెలుసు మీరేం చేయగలరు అనే మనుషుల మధ్య పకృతి వ్యవసాయంలోకి అడుగు పెట్టి ఇప్పుడు అలా అన్నవారికే వ్యవసాయంలో మెళుకువలు చెప్పే స్థాయిలో ఉన్నాను. ఇంటి పని, వంట పని తప్ప ఏమీ చేయలేరనే నానుడి నుంచి పంట పని కూడా వీళ్లు చేయగలరు అనిపించుకున్నాం. ముఖ్యంగా మహిళల్లో ప్రకృతి వ్యవసాయం పట్ల మక్కువ పెంచి ప్రతీ ఇంటి పెరట్లోను ఇంటి పంటలు వేయించి వారికి సరిపడా ఆహారం వారే పండించుకుని తినడంతో పాటు ఆదాయం కూడా పొందేలా చేస్తున్నాం.
– శివకోటి పాప, ప్రకృతి వ్యవసాయ శాఖ
సీఆర్పీ దుర్గాడ, గొల్లప్రోలు మండలం
వంట శాల నుంచి పంట శాలకు
నేను పదవ తరగతి వరకు చదువుకున్నా వివాహం అయ్యాకా ఇంటి పని వంట పనికి పరిమితమయ్యా. కాని ఏదో ఒక చిన్న ఉద్యోగం చేయాలని ఆసక్తి ఉండేది. ఇంతలో ప్రకృతి వ్యవసాయంలో సీఆర్పీగా అవకాశం ఉందని తెలిసి ప్రయత్నం చేశా. తొలుత చాలా భయమేసింది. కాని రంగంలోకి దిగాకా చాలా సులువుగా అనిపించింది. మనం తినే తిండిని ఆరోగ్యకరంగా మార్చే బాధ్యత నేను తీసుకోవడం చాలా ఆనందాన్ని కలిగించింది.
– పి.గంగా పార్వతి, ప్రకృతి వ్యవసాయ శాఖ
సీఆర్పీ దుర్గాడ, గొల్లప్రోలు మండలం
ప్రకృతి మాత ఒడిలో పని చేయడం ఆనందంగా ఉంది
ప్రకృతి మాత ఒడిలో పని చేయడం ఆనందంగా ఉంది
ప్రకృతి మాత ఒడిలో పని చేయడం ఆనందంగా ఉంది
Comments
Please login to add a commentAdd a comment