
ఆ మృతదేహం ఎవరిదో..
పిఠాపురం: మృతుడి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో వారికి దొరికిన రాగి కడియం, మొలతాడే కీలక ఆధారాలుగా మారాయి. హత్య జరిగిందని నిర్ధారించినా అసలు హతుడు ఎవరో తెలియక దర్యాప్తు ముందుకు కదలడం లేదు. వివర్లాలోకి వెళితే.. గొల్లప్రోలు మండలం చేబ్రోలు 216 జాతీయ రహదారి పక్కన ఈ నెల 3వ తేదీన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాలుగు బృందాలు ఆ కేసు దర్యాపు చేస్తున్నారు. అన్ని జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలలోను మిస్సింగ్ కేసులను వెతుకుతున్నారు. హతుడి వద్ద లభించిన రాగి కడియం, మొలతాడు ఆధారంగా ఆచూకీ తెలుసుకోవడానికి పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లకు మృతుడి ఫోటోలు పంపారు. ఘటనా స్థలం సమీపంలోని ప్రాంతాలలో సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. అయితే ఆరు రోజులు గడుస్తున్నా ఎటువంటి చిన్న ఆధారం ఆచూకీ దొరకలేదు.
● ముమ్మరంగా పోలీసుల దర్యాప్తు
● రాగి కడియం, మొలతాడే కీలక ఆధారాలు
● ఆరు రోజులైనా దొరకని ఆచూకీ
Comments
Please login to add a commentAdd a comment