
అల్మారా తెరిచి ఉన్న దృశ్యం
నిజాంసాగర్(జుక్కల్) : జుక్కల్ మండల కేంద్రంలోని బొల్లివార్ శివలక్ష్మి ఇంటికి తాళం వేసి ఉండటంతో గుర్తుతెయని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. శివలక్ష్మి తన ఇంటికి తాళం వేసి ఢిల్లీలో ఉంటున్న కొడుకు వద్దకు వెళ్లింది. మూడు నెలల పాటు అక్కడే ఉన్న శివలక్ష్మి రెండు రోజుల కిందట జుక్కల్ వచ్చింది. ఇంటి తీసి తలుపులను నెట్టగా తలుపులు తెరుచుకోలేదు. స్థానికుల సాయంతో తలుపు తెరిచే చూడగా ఇంట్లోని వస్తువులు చిందరవందగా పడి ఉన్నాయి. ఇంట్లో అల్మారా తెరిచి చూడగా తలుపులు తెరిచి ఉండటంతో పాటు అందులో దాచిఉంచిన అరతులం బంగారు, అరకిలో వెండి అభరణాలతో పాటు రూ. 20 వేల నగదు ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. జిల్లా కేంద్రం నుంచి క్లూస్‌టీంను రప్పించి ఫింగర్ ప్రింట్స్ నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment