
ఎల్లారెడ్డిలో నిర్మించిన ఆరోగ్య స్వస్థత కేంద్రం
ఎల్లారెడ్డిరూరల్(ఎల్లారెడ్డి): గర్భిణులకు సాధారణ ప్రసవాలు జరగాలనే కృతనిశ్చయంతో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య స్వస్థత కేంద్రాలను నిర్మించింది. అయితే, యోగా గురువులు లేకపోవడంతో కేంద్రాలు వృథాగా ఉంటున్నాయి. ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో నేషనల్ ఆయుష్ మిషన్ నిధులతో నిర్మించిన ఆరోగ్యస్వస్థత కేంద్రం ఆరు నెలలుగా ఉపయోగంలోకి రాలేదు. శ్వాస సమస్యలతో ఆస్పత్రికి వచ్చే ఓపీ పేషెంట్లు, సాధారణ ప్రసవాలు అయ్యేలా గర్భిణులతో యోగాసాధన చేయించడానికి ఏర్పాటు చేసిన కేంద్రంలో యోగా గురువు, సిబ్బందిని నియమించలేదు. దీంతో ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని సాధించడం లేదు. లక్షల రూపాయలు వెచ్చించి చేపట్టిన నిర్మాణాలు వృథాగా ఉన్నాయి. అధికారులు స్పందించి యోగా గురువును నియమిస్తే ఆరోగ్యస్వస్థత కేంద్రం ఉపయోగంలోకి వస్తుందని స్థానికులు అంటున్నారు.
యోగా గురువును నియమించాలని
కోరుతున్న గర్భిణులు
Comments
Please login to add a commentAdd a comment