మాచారెడ్డి: జిల్లా స్థాయి 400 మీటర్ల పరుగు పందెంలో సిల్వర్ మెడల్ సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపిౖకైన విద్యార్థినిని శుక్రవారం అధ్యాపకులు అభినందించారు. పాల్వంచ మండలం ఫరీదుపేట గ్రామానికి చెందిన తగిరంచ శ్రావ్య, మాచారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి 400 మీటర్ల పరుగు పందెంలో సిల్వర్ మెడల్ సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు కళాశాల క్రీడల ఇన్‌ఛార్జి నర్సింలు తెలిపారు. ప్రిన్సిపాల్ యాఖినొద్దీన్, అధ్యాపకులు శ్రావ్యను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment