సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పాముల కలకలం
ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించాలి
కామారెడ్డి క్రైం: వేసవిలో ఎండల కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. జాతీయ వాతావరణ మార్పులు –ఆరోగ్య సమస్యల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ అధ్వర్యంలో రూపొందించిన కరపత్రాలు, వాల్‌పోస్టర్లను శుక్రవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి సేవలందించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి శిరీష, వ్యాధి నిరోధక టీకాల అధికారి విద్య, డిప్యూటీ డీఎంహెచ్‌వో ప్రభుదయాకిరణ్, డీపీఆర్వో భీంకుమార్ తదితరులు పాల్గొన్నారు.
రక్తదాన శిబిరానికి కాంగ్రెస్ నాయకులు తరలిరావాలి
కామారెడ్డి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పుట్టిన రోజు సందర్భంగా శనివారం(నేడు) కామారెడ్డి సిరిసిల్లరోడ్డులోని క్లాసిక్ గోల్డెన్ ఫంక్షన్ హాల్‌లో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం నిర్వహించే రక్తదాన శిబిరానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి పిలుపు నిచ్చారు. రక్తం చేసిన ప్రతి ఒక్కరికి హెల్మ్‌ట్ బహుమతిగా అందజేస్తారని ఆయన పేర్కొన్నారు. అలాగే రక్తదాన శిబిరానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ బాలు, రక్తదాతల సమూహం అధ్యక్షుడు జమీల్ తెలిపారు.
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కళా ప్రదర్శన
మాచారెడ్డి: డ్రంక్ అండ్ డ్రైవ్‌తో పాటు మూఢనమ్మకాలపై శుక్రవారం మండల కేంద్రంలో కళా ప్రదర్శ న నిర్వహించారు. మిమిక్రీ కళాకారుడు సుధాకర్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై నిర్వహించిన ప్రదర్శ న అందరిని అలరించింది. అలాగే డ్రగ్స్‌కు అలవాటు పడ్డ యువకులు ఎలా మారిపోతారో మిమి క్రీ ద్వారా వివరించారు. ఎస్సై అనిల్ ఉన్నారు.
ఎల్లారెడ్డి: పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తరచూ పాములు సంచరిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలోని టైల్స్ పగిలిపోవడంతో వాటి మధ్యలోంచి పాములు వచ్చి జనాలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని వారు వాపోతున్నారు. కార్యాలయం కట్టిన ఏడాదికే టైల్స్ పగిలిపోవడంతో ఒకవైపు వాటిపై నుంచి నడవడానికి ప్రజలు ఇబ్బంది పడుతుంటే, మరోవైపు ఏ సందులో నుంచి ఏ పాము వస్తుందోనని భయభ్రాంతులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి టైల్స్‌కు మరమ్మతులు చేసి, పాములు రాకుండా చర్యలు చేపట్టాలని జనాలు కోరుతున్నారు.
పగిలిన టైల్స్ మధ్యలోంచి
వస్తున్న పాములు
ఇబ్బందులు పడుతున్న జనాలు
నిధులు రాగానే మరమ్మతులు
ఎల్లారెడ్డి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో టైల్స్ పగిలిపోవడంతో ఇబ్బందిగా ఉంది. వీటి మరమ్మతుల కోసం ఉన్నతాధికారులకు రూ.4 లక్షల ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరు కాగానే మరమ్మతులు చేయిస్తాం.
– సురేందర్‌బాబు, సబ్ రిజిస్ట్రార్, ఎల్లారెడ్డి
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పాముల కలకలం
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పాముల కలకలం
Comments
Please login to add a commentAdd a comment