వాటరింగ్ డే నిర్వహించాలి
కామారెడ్డి క్రైం: అధికారులు ప్రతి శుక్రవారం తప్పనిసరిగా వాటరింగ్ డే నిర్వహించాలని కలెక్టర్ సంగ్వాన్ సూచించారు. శుక్రవారం ఆయన కళాభారతి ఆడిటోరియం ఎదురుగా ఉన్న మొక్కలకు నీళ్లు పోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మొక్కలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణంలోని పార్క్‌లు, రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలకు నీళ్లు పట్టాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి, డిప్యూటీ ఈఈ వేణుగోపాల్, ఏఈ శంకర్, తదితరులు పాల్గొన్నారు.
పార్క్‌లను అభివృద్ధి చేయాలి
పట్టణంలో పార్క్‌లను అభివృద్ధి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దీనికి సీనియర్ సిటిజన్లు, ఆయా వార్డుల్లోని వెల్ఫేర్ అసోసియేషన్ల సహకారం తీసుకోవాలని సూచించారు. శుక్రవారం ఆయన పట్టణంలోని పంచముఖి హనుమాన్ కాలనీలోగల పార్క్‌ను కలెక్టర్ పరిశీలించారు. పిల్లలు ఆడుకునేందుకు పరికరాలు, ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. పార్క్‌లలో మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దే విధంగా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. శానిటేషన్ పనులు, వాటరింగ్, పార్కుల అభివృద్ధి పనుల వివరాలను రోజు వారీగా సమర్పించాలని ఆదేశించారు.
మొక్కలకు నీళ్లు పోస్తున్న కలెక్టర్ సంగ్వాన్
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Comments
Please login to add a commentAdd a comment