చెట్టును ఢీకొన్న వ్యాన్
బాల్కొండ: ముప్కాల్ మండలం కొత్తపల్లి శివారులో శుక్రవారం ఒమ్ని వ్యాన్ అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న ఎవరికీ కూడా గాయాలు కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ముప్కాల్ మండల కేంద్రం నుంచి ప్రయాణికులతో వస్తున్న ఒమ్ని వాహనం కొత్తపల్లి వద్దకు రాగానే అదుపుతప్పి లక్ష్మికాలువ పక్కన గల చెట్టుకు ఢీకొంది. చెట్టు లేకుంటే నేరుగా వాహనం కాలువలో పడిపోయేదని, దీంతో పెద్ద ప్రమాదం సంభవించేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
కామారెడ్డి క్రైం: పట్టణంలోని కాకతీయనగర్ కాలనీలో తాళం వేసిన ఓ ఇంట్లో చోరీ జరిగింది. వివరాలు ఇలా.. కాలనీలో నివాసం ఉండే జ్ఞానబాయి ప్రయివేటు టీచర్‌గా పని చేస్తున్నారు. గురువారం ఆమె ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి స్వగ్రామమైన గాంధారి మండలం కరక్వాడికి వెళ్లారు. శుక్రవారం ఉద యం ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఉంది. దొంగలు పడినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. ఇంట్లోని బీరువాలో దాచి న 10 తులాల బంగారు ఆభరణాలు, కొంత నగదు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు.
చెట్టును ఢీకొన్న వ్యాన్
Comments
Please login to add a commentAdd a comment