పెళ్లి మెనూలో చికెన్ బంద్
రామారెడ్డి: ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. ఈ నెల 23 వరకు శుభ ముహూర్తాలు ఉన్నాయి. పెళ్లి భోజనాలపై కోళ్ల మృత్యువాత ప్రభావం పడింది. ఎక్కువగా పెళ్లిళ్లలో మాంసాహారంతో భోజనం పెట్టడం సర్వసాధారణం. ఇందులో మొదటి ప్రాధాన్యతగా మటన్, తర్వాత చికెన్, చేపలు, గుడ్లతో విందు భోజనాలు కొనసాగుతాయి. వేల సంఖ్యలో కోళ్లు చనిపోతుండటంతో పెళ్లి విందు మెనూలో చికెన్ తొలగించేస్తున్నారు. దీంతో మటన్‌కు ప్రాధాన్యత భారీగా పెరిగింది. మరోవైపు మటన్ రేటు కూడా కిలో రూ.800 వరకు పలుకుతుండడంతో పెళ్లిళ్లు చేసే వారిపై ఆర్థిక భారం మరింతగా పెరిగింది. గతంలోనైతే మటన్ వడ్డించిన తర్వాత చికెన్ వడ్డించేవారు. ఇప్పుడు రెండుసార్లు కూడా మటన్ పెట్టడంతో శుభకార్యాల విందులు భారంగా మారాయి. అయితే కొంతమంది పెళ్లిళ్లలో చికెన్ పెడుతున్నప్పటికీ తినడానికి చాలామంది ఇష్టపడటం లేదని తెలుస్తోంది.
వైరస్‌లతో కోళ్లు మృతి
చెందడమే కారణం
మటన్ పెట్టడానికే ప్రాధాన్యత
Comments
Please login to add a commentAdd a comment