ఖలీల్‌వాడి: కొబ్బరి బొండాలు తక్కువ ధరకు పంపిస్తామంటూ ఆన్‌లైన్ మోసగాళ్లు బురిడీ కొట్టించారు. నగరానికి చెందిన ఓ వ్యక్తికి రూ.1.68లక్షలకు టోకరా వేశారు. ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. రూ.3లక్షల విలువచేసే కొబ్బరి బొండాలను రూ.1.68 లక్షలకు పంపిస్తామంటూ మొబైల్ ఫోన్‌లో ప్రకటన కనిపించడంతో కోజాకాలనీకి చెందిన షబానాజ్ ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించాడు. కొబ్బరి బొండాలు రాకపోగా, ఆన్‌లైన్‌లో సంప్రదించినా సరైన స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించాడు. టోల్ ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment