
తాళం వేసిన ఇంట్లో చోరీ
ఎడపల్లి(బోధన్): మండలంలోని జాన్కంపేట్ గ్రా మంలో తాళం వేసిన ఓ ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామంలోని ప్రధాన ర హదారి పక్కనే ఉన్న రెండంతస్తుల భవనంలో మొ దటి అంతస్తులో కిరాణ దుకాణం ఉండగా, రెండవ అంతస్తులో నీలా భాస్కర్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. శుభకార్యం నిమిత్తం వారు శుక్రవారం ఇంటికి తాళం వేసి జిల్లాకేంద్రానికి వెళ్లారు. తిరిగి శనివారం ఉదయం ఇంటికి వ చ్చేసరికి తలుపులు తెరిచి ఉండటంతో చోరీ జరిగిన ట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ విజయ్ బాబు, ఎడపల్లి ఎస్సై వంశీకృష్ణష్ణారెడ్డిలు ఘటనా స్థలానికి చే రుకుని పరిశీలించారు. దుండగులు ఇంట్లోకి చొరబ డి బీరువాలో దాచిన సుమారు 13 తులాల బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి వస్తువులతోపాటు, రూ.3లక్షల నగదును ఎత్తుకెళ్లారు. పోలీసులు సీసీ ఫుటేజ్‌లను పరిశీలించగా ఇద్దరు వ్యక్తు లు దొంగతనానికి పాల్పడినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. బాధితుడు నీలా భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

తాళం వేసిన ఇంట్లో చోరీ
Comments
Please login to add a commentAdd a comment