ఇంటర్ ప్రాక్టికల్ పరీక్ష కేంద్రం తనిఖీ
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాన్ని శనివారం జిల్లా నోడల్ అధికారి షేక్ సలామ్ తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటని, ప్రాక్టికల్స్ జరిగినట్లు తెలిపారు. 63 మంది విద్యార్థులకు 61 మంది హాజరైనట్లు తెలిపారు. జిల్లాలో జనరల్ ప్రాక్టికల్స్‌లో 4781 మందికి 4731 మంది హాజరైనట్లు తెలిపారు. ఒకేషనల్ ప్రాక్టికల్స్‌లో 3152 మందికి 3046 మంది హాజరైనట్లు తెలిపారు. ప్రిన్సిపాల్ నరేందర్, తదితరులున్నారు.
28 నుంచి ఎంఈడీ పరీక్షలు
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఎంఈడీ మూడవ సెమిస్టర్ రెగ్యులర్ థీయరీ పరీక్షలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 4వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయని తెలిపారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని కంట్రోలర్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment