వివాహిత అనుమానాస్పద మృతి
● భర్త చంపాడని కుటుంబ సభ్యుల ఆరోపణ
● న్యాయం చేయాలని ఆందోళన
ధర్పల్లి: మండలకేంద్రంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ధర్పల్లికి చెందిన లోలం అనూష (26), వేల్పూర్ మండలం జాన్కంపేటకు చెందిన వినోద్ కొన్నేళ్ల క్రితం ప్రేమించుకుని, పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నా రు. గత కొద్దిరోజులుగా భార్యభర్తలు పిల్లలతో కలిసి ధర్పల్లిలోనే ఉంటున్నారు. ఈక్రమంలో శుక్రవారం దంపతుల మధ్య గొడవలు జరుగ గా వినోద్ ఇంట్లోనుంచి వెళ్లిపోయాడు. అనంతరం అనూష మృతిచెంది ఉండగా, కుటుంబసభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసు లు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చే శారు. అనూషను భర్తే చంపాడని, వెంటనే అత డిని పోలీసులు పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ, మృతురాలి బంధువులు శనివారం రాత్రి మండలకేంద్రంలో ఆందోళన చేపట్టారు. కాగా వినోద్ పరారీలో ఉన్నాడని, పోలీసులు అతని కోసం గాలిస్తున్నట్లు సమాచారం. తక్షణమే అనూష కుటుంబానికి న్యాయం చేయాలని, లేకపోతే ఆందోళన కార్యక్రమం చేపడతామని ఐద్వా సంఘం జిల్లా కార్యదర్శి సుజాత అన్నారు.
వివాహిత అనుమానాస్పద మృతి
Comments
Please login to add a commentAdd a comment