ఒకరి అదృశ్యం
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన నార్ల శంకర్ (40) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు ఎస్సై మహేష్ శనివారం తెలిపారు. శంకర్ కొన్నిరోజుల క్రితం హైదరాబాద్‌కు వలస వెళ్లగా, అతడి తల్లి మృతి చెందడంతో ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. హైదరాబాద్‌లో ఉన్న భార్యను ఈనెల 12న స్వగ్రామానికి రావాలని సూచించగా ఆమె రాలేదు. అప్పటినుంచి అతడు అదృశ్యమయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment