● ఒకరికి రూ.15వేల జరిమానా
భిక్కనూరు: బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన ఓ యువకుడిపై కేసు నమోదు చేసి తహసీల్దార్ ముందు బైండోవర్ చేయడంతో ఆయన జరిమానా విధించినట్లు భిక్కనూరు ఎస్సై అంజనేయులు శనివారం తెలిపారు. మండలంలోని రామేశ్వర్‌పల్లి గ్రామానికి చెందిన పెరుక శ్రీనివాస్ గతంలో ఒక కేసులో తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశామన్నారు. అట్టి బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి అతడు ఒక ఆర్టీసీ బస్ డ్రైవర్‌పై అకారణంగా చేయిచేసుకున్నాడు. దీంతో శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసుకుని భిక్కనూరు తహసీల్దార్ శివప్రసాద్ ఎదుట బైండోవర్ చేయగా రూ.15వేల జరిమానా విధించారన్నారు.
రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
రుద్రూర్: పోతంగల్ మండలం కొడిచర్ల శివారు నుంచి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు శనివారం పట్టుకున్నారు. వీరి వద్ద ఎలాంటి అనుమతి పత్రాలు లేనందున కోటగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోతంగల్ మండలంలోని మంజీరా పరివాహక ప్రాంతాల్లో, గుట్టల్లో, ఇటుక బట్టిల్లో అక్రమార్కులు ఇసుక డంప్‌లు ఏర్పాటు రాత్రి వేళ టిప్పర్‌లలో నింపి పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిపై దృష్టిసారించి అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
పేకాడుతున్న 11మంది అరెస్టు
రుద్రూర్: కోటగిరి మండల కేంద్రంలో పేకాట ఆడుతున్న 11మందిని శనివారం పోలీసులు పట్టుకున్నారు. పేకాట స్థావరంపై విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. పేకాడుతున్న 11మందిని పట్టుకోగా, వారి వద్దనుంచి రూ. 23,440 నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై సందీప్ తెలిపారు.
బోధన్ మండలంలో..
బోధన్ రూరల్: మండలంలోని పెగడపల్లి గ్రామ శివారులో పేకాడుతున్న ఐదుగురిని పట్టుకుని, అరెస్ట్ చేసినట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి శనివారం తెలిపారు. అలాగే వారివద్ద నుంచి రూ.16,390లు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment