నిజాంసాగర్: మహమ్మద్‌నగర్ మండల కేంద్రంలో శనివారం బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు, ఉమ్మడి జెడ్పీ మాజీ చైర్మన్ దపేదార్ రాజు వృక్షార్చన హరిత సేవ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈనెల 17న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మొక్కలు నాటి హరితసేన కార్యక్రమానికి జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గునుకుల్ సొసైటీ చైర్మన్ వాజిద్ అలీ, పార్టీ నాయకులు రామాగౌడ్, విజయ్ కుమార్, మనీష్ రెడ్డి, మిడత సాయిలు, గజ్జల జీవన్, మల్లారెడ్డి, మైత్రి సాయాగౌడ్, నరేశ్, ఆరేటి రవి, మంగ జీవన్, మొకిరె నవీన్, పడమటి కాశీరాం తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డిలో వృక్షార్చన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను నాయకులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో తానోబ ఆనంద్ రావు, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, రమేశ్, రాజాగౌడ్, గంగాధర్‌రావు, సంజీవ్ పాటిల్, ప్రశాంత్ గౌడ్, గని, నాగరాజు, శంకర్, నర్సింలు, కృష్ణ, సాయిలు, రాజేశ్, అనిల్, రాజు, ప్రవీణ్, సుధాకర్, దేవరాజు, వెంకటగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
నిజాంసాగర్: మండలంలోని బ్రాహ్మణపల్లిలో శనివారం సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బండారి చిరంజీవులు, వెంకటేశం, చంద్రకాంత్, సాయిలు, సంగయ్య, సాయిలు, దస్తయ్య, మచ్చేందర్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment