చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి చేపలవేటకు వెళ్లిన ఓ జాలరి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. స్థానిక మత్స్యకారులు తెలిపిన వివరాలు ఇలా.. మండ ల కేంద్రానికి చెందిన బ ట్టుబుద్ది నారాయణ(50) శనివారం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి చేపలవేటకు వెళ్లాడు. వల వేసుకుంటూ నీటిలోపలికి వెళ్లి, తిరిగి బయటకు రాలేడు. స్థానిక మత్స్యకారులు గమనించి అతడు నీటిలో మునిగిపోయాడని గుర్తించారు. వెంటనే గాలింపు చర్యలు చేపట్టగా నీటిలో మృతదేహం లభ్యమైందన్నారు. బాల్కొండ పోలీసులు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
కరెంట్ షాక్‌తో ఒకరు..
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని దేవాయిపల్లి గ్రామంలో ఓ వ్యక్తి కరెంట్‌షాక్‌తో మృతిచెందినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన చిందం మల్లయ్య(48), మరో వ్యక్తితో కలిసి ఈనెల 14న రాత్రి పెళ్లి పందిరికి కావాల్సిన అల్లనేరడు చెట్టకొమ్మలు తేవడానికి బ్రహ్మాజివాడి గ్రామశివారులోకి వెళ్లారు. ఈక్రమంలో ఓ చెట్టుపైకి ఎక్కి అతడు కొమ్మలు కొట్టివేస్తుండగా అక్కడే ఉన్న కరెంట్ తీగలపై పడ్డాయి. కొమ్మలు పచ్చిగా ఉండటంతో విద్యుత్ సరఫరా జరిగి మల్లయ్య కరెంట్‌షాక్‌తో కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య కిష్టవ్వ, కుమారుడు మల్లేష్, ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు శనివారం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
కుక్క దాడిలో పలువురికి గాయాలు
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో శుక్రవారం ఒక పిచ్చి కుక్క వేర్వేరుగా దాడి చేసిన ఘటనలో వృద్ధురాలితోపాటు మరో ఆరుగురికి గాయాలయ్యాయి. గ్రామంలో ఇంటి బయట పనుల్లో నిమగ్నమైన వారిపై కుక్క దాడి చేసి గాయపరిచినట్లు స్థానికులు తెలిపారు. కాగా క్షతగాత్రులను కుటుంబ సభ్యులు ఆర్మూర్ ప్రభు త్వ ఆస్పత్రికి తరలించి చికిత్సలు చేయించారు.
చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి
Comments
Please login to add a commentAdd a comment