నాగమడుగు పేరుతో ఇసుక అక్రమ దందా
బిచ్కుంద: నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ అభివృద్ధి పనుల సాకుతో రాత్రి, పగలు అనే తేడా లేకుండా ట్రాక్టర్లు, టిప్పర్లలో అక్రమంగా తరలిస్తున్న ఇసుకను దేవాడ వద్ద శనివారం రాత్రి గ్రామస్తులు అడ్డుకున్నారు. ఉదయం 11 గంటలకు లారీకి నాగమడుగు ఫ్లెక్సీలు పెట్టి హైదరాబాద్, జహీరాబాద్‌కు ఇసుక తరలిస్తుండగా గ్రామస్తులు గుర్తించి పట్టుకున్నారు. అనుమతి పత్రాలు చూయించాలని వారు కోరగా కాంట్రాక్టర్ టిప్పర్లను అక్కడే వదిలేసి బాన్సువాడ సబ్ కలెక్టర్ నుంచి అనుమతి తీసుకొచ్చారు. ఇందులో పుల్కల్ క్వారీ నుంచి సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు మాత్రమే ఇసుక తీసుకెళ్లాలని అధికారులు అనుమతి పత్రం ఇచ్చారు. కానీ కాంట్రాక్టర్ నిబంధనలు పాటించడం లేదు. హజ్గుల్ మంజీరా నుంచి ట్రాక్టర్లలో సిర్‌సముందర్ శివారులో రెండు చోట్ల ఇసుక డంపులు వేసి లారీల్లో అక్రమంగా తరలిస్తున్నారు. వాహనాలను అడ్డుకున్నట్లు సమాచారం తెలుసుకున్న ఆర్‌ఐ రవీందర్ ఘటన స్థలానికి చేరుకొని కాంట్రాక్టర్‌కు అనుమతి పత్రం ఇచ్చారు. ఇసుకను ఎందుకు అక్రమంగా తరలిస్తున్నారని ప్రశ్నించాల్సిన అధికారులు అక్రమదారులకు వత్తాసు పలకడం గమనార్హం. బాన్సువాడ సబ్ కలెక్టర్, జిల్లా అధికారుల అనుమతి లేకుండానే హజ్గుల్, ఖద్గాం, పుల్కల్ క్వారీ నుంచి ఇసుక అక్రమ దందా జోరుగా సాగుతోందని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
హజ్గుల్ క్వారీ నుంచి శివారులో డంపులు
అనుమతి లేని టిప్పర్లను
పట్టుకున్న గ్రామస్తులు
నాగమడుగు పేరుతో ఇసుక అక్రమ దందా
Comments
Please login to add a commentAdd a comment