ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్
నిజాంసాగర్: మహమ్మద్‌నగర్ మండల కేంద్రంలోని మంజీరా పాఠశాలలో శనివారం నిర్వహించిన చిన్నారుల ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం ఆకట్టుకుంది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్న చిన్నారులు తమ ఇళ్ల నుంచి తీసుకొచ్చిన వంటకాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కీర్తిరమ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ముమ్మరంగా చెరుకు క్రషింగ్
సదాశివనగర్: మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి గాయత్రి షుగర్స్ ఫ్యాక్టరీలో చెరుకు క్రషింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. శుక్రవారం నాటికి 3లక్షల437 టన్నుల క్రషింగ్ జరిగినట్లు ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్‌రావు తెలిపారు.
ఎల్లారెడ్డికి నలుగురు
ఉపాధ్యాయుల కేటాయింపు
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మండలానికి నలుగురు ఉపాధ్యాయులు నియామకమైనట్లు ఎంఈవో వెంకటేశం శనివారం తెలిపారు. జిల్లా కేంద్రంలో డీఈవో రాజు ఉపాధ్యాయులకు నియామకపత్రాలు అందించినట్లు పేర్కొన్నారు. మండలంలోని సాతెల్లి పాఠశాలకు ప్రవీణ్, జంగమాయిపల్లి పాఠశాలకు భాగ్యలక్ష్మి, కట్టకిందితండాకు కళ్యాణి, వెల్లుట్ల ప్రాథమిక పాఠశాలకు సత్తయ్యకు పోస్టింగ్ ఇచ్చినట్లు తెలిపారు. వీరు సోమవారం విధుల్లో చేరనున్నట్లు పేర్కొన్నారు.
18న క్రీడాకారుల ఎంపిక
తాడ్వాయి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీస్టేడియంలో ఈనెల 18న అండర్16 విభాగంలో జిల్లాస్థాయి క్రీడాకారుల ఎంపిక ఉంటుందని తెలంగాణ క్రికెట్ అసోసిసేషన్ జి ల్లా కార్యదర్శి కుమ్మరి ధన్‌రాజ్ తెలిపారు. ఆ యన శనివారం తాడ్వాయిలో మాట్లాడారు. ఇందులో ఎంపికై న వారు ఈ నెల 28 నుంచి మార్చి2 వరకు నిర్వహించే టోర్నమెంట్‌లో పా ల్గొంటారన్నారు.ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పాఠశాల తనిఖీ
ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని వెంకటాపూర్‌లో ఉన్న ప్రాథమిక పాఠశాలను ఎంపీవో ప్రకాశ్ శనివారం తనిఖీ చేసి విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు అడిగారు. ఆయన వెంట ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment