కూతురిని ఇంటికి తీసుకువస్తుండగా రోడ్డు ప్రమాదం
సదాశివనగర్(ఎల్లారెడ్డి): గల్ఫ్ నుంచి ఇంటికి వచ్చిన తండ్రి, హైదరాబాద్‌లోని హాస్టల్‌లో ఉంటున్న కూతురును ఇంటికి తీసుకువస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరింది. సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి హైవే 44పై ఈఘటన జరుగగా తండ్రి మృతిచెందాడు. కుమార్తెకు తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కుకునూర్ గ్రామానికి చెందిన ర్యాడ గంగాధర్(45), ఈనెల 14న దుబాయ్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాడు. అతడి కూతురు లహరి హైదరాబాద్‌లో హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటుండగా, ఇంటికి తీసుకురావడానికి శుక్రవారం ఆయన కారులో వెళ్లారు. కూతురుతో కలిసి కారులో స్వగ్రామానికి వస్తుండగా శనివారం తెల్లవారుజామున అడ్లూర్ ఎల్లారెడ్డి బ్రిడ్జి వద్దకు రాగానే ఆర్టీసీ బస్సును ఢీకొన్నారు. దీంతో కారు అదుపుతప్పి డివైడర్ ఎక్కి ముందున్న లారీని ఢీకొట్టడంతో గంగాధర్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కూతురు గాయపడగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రంజీత్ తెలిపారు.
అదుపుతప్పి బస్సు, లారీని ఢీకొన్న కారు
తండ్రి మృతి, కుమార్తెకు తీవ్ర గాయాలు
Comments
Please login to add a commentAdd a comment