పిచ్చెక్కిస్తున్న కల్తీ కల్లు | - | Sakshi
Sakshi News home page

పిచ్చెక్కిస్తున్న కల్తీ కల్లు

Published Sun, Feb 16 2025 1:26 AM | Last Updated on Sun, Feb 16 2025 1:25 AM

పిచ్చెక్కిస్తున్న కల్తీ కల్లు

పిచ్చెక్కిస్తున్న కల్తీ కల్లు

విచ్చలవిడిగా..

కామారెడ్డి క్రైం: ప్రజల జీవితాలను కల్తీ కల్లు చిత్తు చేస్తోంది. కల్లు లభించకపోతే పిచ్చివారిగా మారిపో తున్నారు. కల్తీ కల్లు కారణంగా కొందరు ఆస్పత్రుల పాలవుతుండగా చాలామంది వింతగా ప్రవర్తించడంతోపాటు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఒక్కసారి అలవాటు పడితే కల్తీ కల్లు లేనిదే ఉండలేరు. మందు కల్లు తాగేవారికి అది లభించకపోతే కాళ్లు, చేతులు పని చేయవు. ఈ నేపథ్యంలో ఏదైనా ఊరికి వెళ్లేవారు బట్టలు సర్దుకోవడంతో పాటు కల్లు ప్యాకెట్‌లను కూడా వెంట తీసుకువెళ్తారు.

పోటీ పడి మరీ...

కల్తీ కల్లు తయారీలో ప్రమాదకరమైన మత్తు మందులను వాడుతున్నారు. పొద్దంతా శ్రమించి వచ్చే వారు అలసటను మర్చిపోవడం కోసం కల్లు సేవిస్తుంటారు. గతంలో ఎకై ్సజ్‌ శాఖ దాడులు పెరగడంతో మత్తు పదార్థాల వినియోగం తగ్గినప్పుడు వాటి ప్రభావం బయటపడింది. డైజోఫాం, అల్ఫ్రాజోలం లేకుండా కల్లు విక్రయించినప్పుడు మత్తు దొరక్క వందల సంఖ్యలో కల్లు ప్రియులు వింతగా ప్రవర్తించారు. కొందరు మతిస్థిమితం కోల్పోయా రు. పలు కల్లు డిపోలలో ప్రమాదకరమైన మత్తు మందులను పోటీపడి మరీ కలుపుతున్నారనే ఆరోపణలున్నాయి. తమ వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం డోసు పెంచుతున్నట్లుగా తెలుస్తోంది. ఎంతో మంది మందుకల్లు మత్తులో విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అన్నీ తెలిసి కూడా ఎ ౖక్సైజ్‌ శాఖ ఈ అక్రమ దందాను అడ్డుకునే ప్ర యత్నం చేయడం లేదన్న విమర్శలున్నాయి. ఎకై ్సజ్‌ అధికారులు మామూళ్ల మత్తులో కల్తీని పట్టించుకో వడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

చర్యలు తీసుకుంటాం

స్వచ్ఛమైన కల్లును మాత్రమే విక్రయించాలి. కల్తీ కల్లును విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. గతంలో మా దృష్టికి వచ్చిన అన్ని ఫిర్యాదులపైన విచారణ జరిపించాం. ఇటీవల మాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. ఎక్కడైనా కల్తీ కల్లు విక్రయిస్తున్నట్లయితే సమాచారం ఇవ్వాలి. తగిన చర్యలు తీసుకుంటాం.

– హన్మంత్‌రావు,

ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌, కామారెడ్డి

జిల్లాకేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల ఆత్మహత్యకు యత్నించాడు. అతడిని కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చించారు. అయితే అతడు కల్తీ కల్లుకు బానిస. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మూడు రోజులపాటు కల్లుకు దూరంగా ఉండడంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాడు. చేసేది లేక ఆస్పత్రి సిబ్బంది కాళ్లు, చేతులు కట్టేసి వైద్యం అందించారు. అయినా కట్లు తెంచుకుని నానా హంగామా సృష్టించాడు. కల్తీ కల్లు దొరక్కే ఇలా ప్రవర్తించాడని వైద్యులు చెప్పారు.

పట్టణానికి చెందిన ఓ వృద్ధుడు రెండు నెలల క్రితం కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు ఉత్తరాదికి వెళ్లాడు. అతడికి మందు కలిపిన కల్లు అలవాటు ఉంది. తీర్థ యాత్రలో మందు కల్లు లభించకపోవడంతో వింతగా ప్రవర్తించాడు. ఓ పుణ్యక్షేత్రం వద్ద కుటుంబాన్ని వదిలి ఎక్కడికో వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు నాలుగు గంటల పాటు శ్రమించి అతడిని పట్టుకుని అద్దె కారులో కామారెడ్డికి తరలించారు.

జిల్లాలో యథేచ్ఛగా విక్రయాలు

అనారోగ్యం పాలవుతున్న

కల్లు ప్రియులు

మామూళ్ల మత్తులో ఎకై ్సజ్‌శాఖ

యంత్రాంగం

జిల్లాలో 22 కల్లు డిపోలున్నాయి. వీటిలో కల్లును తయారు చేసి దుకాణాలకు సరఫరా చేస్తుంటారు. జిల్లా కేంద్రంలో రెండు డిపోలు, ఇవేకాకుండా మండల కేంద్రాలతో పాటు ప్రధాన గ్రామాల్లో డిపోలు, వ్యక్తిగత లైసెన్సులు కలిగిన కల్లు తయారీ కేంద్రాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా కల్లు డిపోలలో స్వచ్ఛమైన కల్లుకు బదులుగా కల్తీకల్లు తయారు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈత చెట్ల నుంచి సేకరించే స్వచ్ఛమైన కల్లు చుక్క కూడా ఉండడం లేదు. నీళ్లలో రంగు రుచి కోసం పౌడర్‌లు కలిపి తయారు చేస్తూ, డైజోఫాం, అల్ఫ్రాజోలం లాంటి మత్తు మందులను, నిద్ర మాత్రల పొడిని కలుపుతున్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement