దోమకొండలో 50 పడకల ఆస్పత్రి!
కామారెడ్డి టౌన్: దోమకొండలో 50 పడకలతో నూతన ఆస్పత్రి భవనాన్ని నిర్మించేందుకు తెలంగాణ మెడికల్ సర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(టీజీఎంఎస్‌ఐడీసీ) రూ. 22 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నిధులు, అనుమతి కోసం తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్‌కు, ప్రభుత్వానికి నివేదించింది. ఆస్పతి భవన నిర్మాణం కోసం ముత్యంపేట రోడ్‌లోని సర్వే నంబర్ 1796, 1797లలో 4.03 ఎకరాల స్థలాన్ని గతంలోనే కేటాయించిన విషయం తెలిసిందే. ఈ స్థలంలో సివిల్ వర్క్స్, అస్పత్రి భవనం, మార్చురీ గది నిర్మాణం కోసం రూ. 11.22 కోట్లు, కాంపౌండ్ వాల్‌కోసం రూ. 10 లక్షలు, సీసీ రోడ్డుకోసం రూ. 7 లక్షలు, మెడికల్ గ్యాస్ పైప్‌లైన్ కోసం రూ. 25 లక్షలు అవసరం అవుతాయని అంచనాలు వేశారు. ఫైర్ ఫిటింగ్ సిస్టంకోసం రూ. 20 లక్షలు, నీటి సరఫరా, సానిటరీ ఏర్పాట్లకు రూ. 1.14 కోట్లు, విద్యుత్ సరఫరా, ఇతర ఏర్పాట్లకు రూ. 1.71 కోట్లు, మెడికల్ పరికరాలకు రూ. 1.25 కోట్లు, ఇంజినీరింగ్, ఇతర అభివృద్ధి పనులకు రూ. 6 కోట్ల వరకు అవసరం అవుతాయని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే పనుల చేపట్టనున్నారు.
రూ. 22 కోట్లతో ప్రతిపాదనలు
Comments
Please login to add a commentAdd a comment