సంరక్షణ చర్యలేవి?
● గతనెలలో మాల్తుమ్మెద
ఉద్యాన క్షేత్రంలో అగ్నిప్రమాదం
● పాక్షికంగా కాలిపోయిన చెట్లు..
నీరందక ఎండుతున్న వైనం
నాగిరెడ్డిపేట: అగ్నిప్రమాదంలో పాక్షికంగా దెబ్బతిన్న చెట్లను సంరక్షించడానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో చెట్టు పూర్తిగా ఎండుముఖం పడుతున్నాయి. మాల్తుమ్మెద ఉద్యాన క్షేత్రంలో గతనెల 20న అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఉద్యానక్షేత్రం బయటవైపు గుర్తుతెలియని వ్యక్తులు పెట్టిన నిప్పు గాలికి వ్యాపించి క్షేత్రంలోకి ప్రవేశించింది. క్షేత్రంలో గడ్డి దట్టంగా పెరగడం వల్ల ఉద్యానక్షేత్రాన్ని మంటలు చుట్టుముట్టాయి. దీంతో ఉద్యాన క్షేత్రంలోని ఆయిల్‌పాం చెట్లు పూర్తిగా దగ్ధమవ్వగా 35 మామిడి చెట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. జిల్లా ఉద్యాన శాఖ అధికారి జ్యోతి ఉద్యాన క్షేత్రాన్ని పరిశీలించి, పాక్షికంగా కాలిపోయిన చెట్లను సంరక్షించడానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రమాదం జరిగి నెల కావస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఫలితంగా క్షేత్రంలోని మామిడి చెట్లు ఎండుముఖం పడుతున్నాయి.
బోరుమోటారుకు మరమ్మతులు చేయిస్తాం
గత నెలలో ఉద్యాన క్షేత్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కొన్ని మామిడి చెట్లు దెబ్బతిన్నాయి. వాటికి నీరందించి సంరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది. కానీ క్షేత్రంలో బోరు మోటారు చెడిపోయింది. దానికి మరమ్మతులు చేయించి చెట్లను సంరక్షిస్తాం. – కమలాకర్‌రెడ్డి, హార్టికల్చర్ అధికారి, మాల్తుమ్మెద
సంరక్షణ చర్యలేవి?
Comments
Please login to add a commentAdd a comment