చలానా సొమ్ము తిరిగిచ్చేదెప్పుడో?
దోమకొండ: ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం ప్రభుత్వం చలానాల రూపంలో డబ్బులు వసూలు చేస్తుంది. అయితే అనివార్య కారణాలతో రిజిస్ట్రేషన్ రద్దయితే దరఖాస్తుదారుకు చలానాలను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే సుమారు ఐదేళ్లుగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో దరఖాస్తుదారులు ఇబ్బందిపడుతున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. నిజామాబాద్ అర్బన్, రూరల్‌తో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, దోమకొండలలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఆయా కార్యాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్ రద్దయినవారికి ఐదేళ్లుగా చలానాలు వాపస్ రావడం లేదు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుమారు 600 మందికి సంబంధించి రూ. 15 కోట్ల రూపాయల రావాల్సి ఉందని తెలుస్తోంది. చలానాలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోనివారు తమ డబ్బుల కోసం దరఖాస్తు చేసుకుంటే వారి వివరాలను తీసుకుని బిల్లులు చేసి కోశాగార కార్యాలయానికి పంపిస్తున్నామని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా ఇటీవల కోశాగార కార్యాలయానికి పంపిన బిల్లులు తిరస్కరణకు గురైనట్లు తెలిసింది. మళ్లీ బిల్లులు చేయడానికి ఉన్నతాధికారుల అనుమతికోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే డబ్బులు విడుదల చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.
రిజిస్ట్రేషన్ రద్దయితే చలానాలు
తిరిగి చెల్లించని సర్కారు
ఐదేళ్లుగా పెండింగ్‌లోనే..
ఉమ్మడి జిల్లాలో
రూ. 15 కోట్లకుపైనే బకాయిలు
Comments
Please login to add a commentAdd a comment