కొనసాగుతున్న ఇంటర్ ప్రాక్టికల్స్
కామారెడ్డి టౌన్: జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం జరిగిన పరీక్షకు 581 మందికిగాను 570 మంది హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 160 మందికిగాను 154 ప్రాక్టికల్స్ పరీక్షలో పాల్గొన్నారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 362 విద్యార్థులకుగాను 333 మంది, వొకేషనల్ విభాగంలో 240 కిగాను 227 హాజరయ్యారు. పలు పరీక్ష కేంద్రాలను జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం తనిఖీ చేశారు.
బెంగళూరు ఏసీ బస్సుల్లో 10 శాతం రాయితీ
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : బెంగళూరుకు వెళ్లే ఆర్టీసీ ఏసీ బస్సుల్లో 10 శాతం రాయితీ ఇస్తున్నట్టు సంస్థ రీజినల్ మేనేజర్ టి.జోత్స్న ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏసీ స్లీపర్, ఏసీ సీటర్, రాజధాని బస్సులకు ఈ రాయితీ వర్తిస్తుందని పేర్కొన్నారు. ప్రయాణికులకు ఉన్నత స్థాయి ప్రయాణాన్ని మరింత అందుబాటులో ఉంచడం, సౌకర్యవంతం చేయడం లక్ష్యంగా ఈ ఆఫర్ ప్రవేశపెట్టినట్టు తెలిపారు. ముందస్తు రిజర్వేషన్‌ల కోసం www.tgsrtcbus.in వెబ్‌సైట్‌లోగాని, సమీప బస్సు రిజర్వేషన్ కౌంటర్‌లలోగాని సంప్రదించాలని సూచించారు.
గురుకులంలో
సబ్ కలెక్టర్ బస
బాన్సువాడ రూరల్: బోర్లం క్యాంపులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ఆదివారం రాత్రి సబ్ కలెక్టర్ కిరణ్మయి సందర్శించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రాత్రి అక్కడే బస చేశారు.
క్రషింగ్ గడువు పొడిగింపు
నిజాంసాగర్: మాగిలోని గాయత్రి కర్మాగారంలో చెరుకు క్రషింగ్ గడువును ఈనెల 20 వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కర్మాగారం కేన్ మేనేజర్ వెంగళ్‌రెడ్డి తెలిపారు. ఈ సంవత్సరం కర్మాగారంలో 4 లక్షల మెట్రిక్ టన్ను ల చెరుకు గానుగ ఆడించాలన్నది లక్ష్యం కాగా ఇప్పటి వరకు 3.53 లక్షల మెట్రిక్ టన్నుల చెరుకు క్రషింగ్ జరిగిందన్నారు. క్రషింగ్ గడువు 15 వరకు ఉండగా వారం రోజుల పాటు పొడిగించామన్నారు.
పొదుపుగా వాడుకోవాలి
సుభాష్‌నగర్: ఇంధనాన్ని పొదుపుగా వాడు కొని భవిష్యత్ తరాలకు అందించాలని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) ఆర్‌ఎం శ్రీనివాస్ పిలుపునిచ్చారు. నిజామాబాద్‌లోని న్యూ కలెక్టరేట్ రోడ్డులో ఆదివారం హెచ్‌పీసీఎల్ ఆధ్వర్యంలో ‘సాక్షం–2025’ కార్యక్రమాన్ని నిర్వహించి ఇంధన పొదుపుపై అవగాహన ర్యాలీ చేపట్టారు. ఇంధన పొదుపులో భాగంగా ప్రత్యామ్నాయ వనరులైన సీఎన్‌జీ, ఎలక్ట్రికల్ వాహనాల వైపు మొగ్గు చూపాలన్నారు.
కొనసాగుతున్న ఇంటర్ ప్రాక్టికల్స్
Comments
Please login to add a commentAdd a comment