సాంకేతిక లోపంతో టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్
భిక్కనూరు: మండల కేంద్ర సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద సాంకేతిక లోపం ఏర్పడడంతో ఆదివారం సుమారు అరగంట పాటు వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుకు ఇరువైపులా వందలాది వాహనాలు నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. మూడు రోజుల క్రితం టోల్ ప్లాజాకు కొత్త కాంట్రాక్టర్ వచ్చారు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసినప్పటికీ మొరాయించడంతో పలుమార్లు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కామారెడ్డి వైపు వెళ్తున్న అంబులెన్స్ ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో పోలీసులు శ్రమించి ట్రాఫిక్ క్లియర్ చేసి పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment