నస్రుల్లాబాద్(బాన్సువాడ): మండలంలోని దుర్కి గ్రామంలో తాళం వేసిన ఓ ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన రేఖవార్ రాజు తన భార్య స్వరూపారాణితో కలిసి ఈ నెల 9న ఇంటికి తాళం వేసి మహా కుంభమేళ కోసం ప్రయాగ్ రాజ్‌కు వెళ్లారు. ఈనెల 15న పక్కింటి వారు వాళ్లకి ఫోన్ చేసి, మీ ఇంటి తలుపులు తెరచి ఉన్నాయంటూ సమాచారం అందించారు. వారు ఆదివారం ఇంటికి వచ్చి చూడగా, చోరీ జరిగినట్లు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు వివరాలు సేకరించారు. తాళం పగలగొట్టిన గుర్తుతెలియని దుండగులు ఇంట్లోని సుమారు 3తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. ఈమేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లావణ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment