పేకాడుతున్న ఆరుగురి అరెస్టు
బోధన్‌రూరల్: సాలూర మండలకేంద్రంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పట్టుకున్నట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్‌రెడ్డి ఆదివారం తెలిపారు. అలాగే వారి వద్ద నుంచి రూ.11,600లు నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
బోధన్‌రూరల్: మండలంలోని కల్దుర్కి గ్రామం నుంచి అక్రమంగా బోధన్‌కు ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్‌రెడ్డి ఆదివారం తెలిపారు. పట్టుబడిన ట్రాక్టర్ సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించామని, కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.
మాజీ ప్రజాప్రతినిధిపై ఫిర్యాదు
రుద్రూర్: మండలంలోని సులేమాన్‌నగర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ గౌస్‌పై అతడి వదిన పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈసందర్భంగా ఆమె ఆదివారం మాట్లాడుతూ.. తాను గ్రామంలో లేనిసమయంలో సదరు మాజీ ప్రజాప్రతినిధి తన ఏటీఎం తీసుకుని రెండు పెట్రోల్ బంకుల్లో స్వైప్ చేసి రూ. లక్షా9వేలు తీసుకున్నట్టు ఆవేదన వ్యక్తం చేసింది. విచారణ జరిపి న్యాయం చేయాలని మహిళ విజ్ఞప్తి చేసింది. ఈ విషయమై పోలీస్‌ష్టేషన్‌లో సంప్రదించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
మద్నూర్‌లో పెంటకుప్ప దగ్ధం
మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని గాంధీచౌక్‌లో ఆదివారం ప్రమాదవశాత్తు పెంటకుప్ప దగ్ధమయినట్లు బాధితుడు హుల్లాజీ తెలిపారు. తన ఇంటికి సమీపంలో గల పెంటకుప్పకు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకోవడంతో మంటలు చెలరేగాయని ఆయన తెలిపారు. ఈ విషయమై ఫైర్‌స్టేషన్‌కు స మాచారం అందించడంతో వారు వచ్చి మంటలను ఆర్పివేశారన్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.పదివేల నష్టం జరిగిందని వారు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment