క్రైం కార్నర్
అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య
నిజాంసాగర్(జుక్కల్): జు క్కల్ మండలకేంద్రానికి చెందిన బెజ్జవార్ చంద్రమోహన్(34) అనే వ్యక్తి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై భువనేశ్వర్ తెలిపారు. వివరాలు ఇలా.. జుక్కల్‌కు చెందిన చంద్రమోహన్‌కు అప్పులు ఎక్కువవడంతో మద్యానికి బానిసయ్యాడు. శనివారం తాను అప్పులు తీర్చేది ఎట్లా అంటూ ఇంటి వద్ద రోధించి బయటకు వెళ్లి, తిరిగి రాలేడు. ఆదివారం తెల్లవారుజామున ఉప్పలంచవార్ లక్ష్మణ్ ఇంటి వద్ద ఉన్న పాడుబడ్డ బావిలో చంద్రమోహన్ శవమై కన్పించాడని ఎస్సై తెలిపారు. అప్పుల బాధతో అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఈమేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
అనారోగ్యంతో ఒకరు..
ఖలీల్‌వాడి: నగరంలోని సంజీవ్‌నగర్ కాలనీకి చెందిన వర్షపల్లి మల్లేష్(64) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై హరిబాబు ఆదివారం తెలిపారు. వివరాలు ఇలా.. మల్లేష్ గత కొన్ని సంవత్సరాల నుంచి బ్రెయిన్ స్ట్రోక్ వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది శనివారం బాత్రూంలో ఉన్న ఫినాయిల్ తాగి, ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే కుటుంబసభ్యులు అతడిని గమనించి, ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసినట్లు తెలిపారు.
క్రైం కార్నర్
Comments
Please login to add a commentAdd a comment