కుళ్లిపోయిన మటన్ అమ్ముతున్నారని ఫిర్యాదు
బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలోని మటన్ షాపుల్లో కుళ్లిపోయిన మేక మాంసం అమ్ముతున్నారని ఆదివారం పంచాయతీ, వెటర్నరీ అధికారులకు ప్రజలు ఫిర్యాదు చేశారు. దీంతో పంచాయతీ సిబ్బంది మటన్ విక్రయించే షాపులకు వెళ్లి తనిఖీ చేశారు. రెండు రోజు క్రితం కోసిన మేక మాంసం ఫ్రిజ్‌లో పెట్టి అమ్ముతున్నారని, వాసన వస్తుందని అధికారులు తెలిపారు. ఇలాంటి మాంసం అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాంసం కోసం కోస్తున్న మేకలు, గొర్రెలు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా వెటర్నరీ అధికారులు పరిశీలించకుండానే కోస్తున్నారు. అలాగే చాలా మంది చికెన్, మటన్ షాపుల లైసెన్స్ లేకుండానే నిర్వహిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని మాంసంప్రియులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment