బండరాళ్లు పెట్టి బలిచేయొద్దు
బాల్కొండ: రైతులు తమ పంట దిగుబడులను తారు రోడ్లపై ఆరబెడుతూ, రక్షణగా బండరాళ్లును ఏర్పాటు చేస్తున్నారు. దీంతో రోడ్లపై రాళ్లతో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని వాహనదారులు వాపోతున్నారు. ప్రస్తుతం జొన్న కోతలు జోరందుకోవడంతో రైతులు నూర్పిళ్లు చేసిన పంట దిగుబడులను తారు రోడ్లపై ఆరబెడుతున్నారు. అలా ఆరబెట్టిన జొన్నల పక్కన బండరాళ్లను, కర్రలను పెడుతున్నారు. దీంతో రోడ్డుపై ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. గతేడాది ముప్కాల్ మండలం రెంజర్ల శివారులో ఎర్ర జొన్నల పంటలకు అడ్డుగా పెట్టిన రాళ్ల కారణంగా ప్రమాదం సంభవించి అదే గ్రామానికి చెందిన యువకుడు మృత్యువాత పడ్డాడు. అంతేకాకుండ వేర్వేరు ఘటనల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయినా పాలకులు, అధికారులు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలేదు.
ఇదీ పరిస్థితి..
రోడ్లపై పంటల పక్కన ఏర్పాటు చేసిన రాళ్లను రా త్రివేళల్లో వాహనదారులు గుర్తించక ప్రమాదాలకు గురవుతున్నారు. మరికొంతమది రైతులు పంట దిగుబడులను తరలించిన కూడా రోడ్లపై బండరాళ్లను అలానే వదిలి వెళ్తున్నారు. అన్నదాతలు తారు రోడ్లపై పంట దిగుబడులను ఆరబెట్టినా, వారి పా ట్లను గమనించి ప్రజలు ఎలాంటి ఫిర్యాదులు చే యడం లేదు. కాని బండరాళ్లను పెట్టడం వల్ల ప్రా ణాలు పోతున్నాయని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. తారు రోడ్లపై ఇప్పటి నుంచి మే వరకు ఏదో ఒక పంట దిగుబడి వస్తూనే ఉంటుంది. జొన్నలు పూర్తయ్యేలోపు వరి పంటలు చేతికి వ స్తాయి. దీంతో వరి ధాన్యం రోడ్లపై ఆరబెడుతారు. తర్వాత సజ్జ పంటలు చేతికి రాగానే వాటిని ఆరబెడుతారు. ఇలా ఏడాదిలో జూన్, జూలై, ఆగష్టు మా సాల్లోనే రోడ్లు ఖాళీగా ఉంటాయి. సెప్టెంబర్‌లో మ క్కలు, నవంబర్, డిసెంబర్‌లో వానాకాలం వరి పంటలు, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో జొన్న పంటలు ఇలా ఎప్పుడు రోడ్లు పంట దిగుబడులతోనే దర్శనమిస్తున్నాయి. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించి రైతులకు ఇతర ప్రాంతాల్లో సిమెంట్ కళ్లాలను నిర్మించాలని, ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
బాల్కొండ మండలంలో జొన్న పంటను రోడ్లపై ఆరబెడుతున్న రైతులు
రక్షణగా పక్కన రాళ్లు పెడుతున్న వైనం
ప్రమాదం పొంచి ఉందంటున్న
వాహనదారులు
కేసులు నమోదు చేస్తాం..
రోడ్లపై పంట దిగుబడులను ఆరబెడుతూ పక్కన రాళ్లు పెట్టిన వారిపై కేసులు నమోదు చేస్తాం. రాళ్ల కారణంగా వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. రైతులు ప్రయాణికుల ఇబ్బందులను కూడా అర్థం చేసుకోవాలి.
– రజనీకాంత్, ఎస్సై, ముప్కాల్
Comments
Please login to add a commentAdd a comment