హిందీ బోధించడంలో దిట్ట
ఎల్లారెడ్డిరూరల్: విద్యార్థులకు హిందీ బోధనతో పాటు ఎన్‌సీసీ ద్వారా మార్చ్ ఫాస్ట్ నేర్పుతున్నారు హిందీ ఉపాధ్యాయులు బల్వంత్‌రావు. అలాగే సరళంగా అర్థమయ్యే రీతిలో హిందీ వ్యాకరణ పుస్తకాన్ని రచించారు. ఎల్లారెడ్డి పట్టణంలోని మోడల్ స్కూల్‌లో హిందీ ఉపాధ్యాయుడిగా కంఠా లే బల్వంత్‌రావు ప్రస్తుతం విధులు నిర్వహిస్తు న్నారు. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని సుక్క ల్ తీర్థం గ్రామానికి చెందిన బల్వంత్‌రావు విద్యాభ్యాసం పూర్తయిన తరువాత కొన్ని సంవత్సరాలు ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేశా రు. అనంతరం 2011లో సంగారెడ్డి జిల్లాలోని పెద్ద శంకరంపేట మోడల్‌స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా నియమితులయ్యారు. హిందీ బోధన చేయడంతో పాటు విద్యార్థులకు తన వంతుగా ఏదైనా నేర్పించాలనే ఉద్దేశంతో ఎన్‌సీసీ శిక్షణ పొంది బల్వంత్‌రావు విద్యార్థులకు సైతం మార్చ్‌ఫాస్ట్ నేర్పించారు. ఆయన సేవలను గుర్తించిన అధికారులు 2016లో మండల ఉత్తమ ఉపాధ్యాయుడిగా, 2019లో సంగారెడ్డి జిల్లా ఉత్తమ హిందీ ఉపాధ్యాయుడిగా అవార్డులను అందుకున్నారు. ఇటీవల జరిగిన గణతంత్ర వేడుకలలో విద్యార్థులతో మార్చ్‌ఫాస్ట్ చేయించి అందరి మన్ననలు పొందారు. తనలో ఉన్న కళను విద్యార్థులకు నేర్పించి సంతృప్తి చెందుతున్నారు బల్వంత్‌రావు.
అందరి మన్ననలు పొందుతున్న
ఉపాధ్యాయులు బల్వంత్‌రావు
విద్యార్థులకు హిందీ బోధనతో పాటు
ఎన్‌సీసీ ద్వారా మార్చ్‌ఫాస్ట్ నిర్వహణ
సరళంగా హిందీ వ్యాకరణం
అర్థమయ్యేలా పుస్తక రచన
గుర్తింపు ఉండాలన్నదే నా తపన
పాఠశాలలో ప్రత్యేక గుర్తింపు ఉండాలనే లక్ష్యంతో విద్యార్థులకు చదువుతో పాటు మార్చ్‌ఫాస్ట్ నేర్పుతున్నాను. తాను ఎన్‌సీసీలో పొందిన శిక్షణను విద్యార్థులకు అందిస్తున్నాను. విద్యార్థులు వ్యాకరణంలో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సరళ వ్యాకరణ పుస్తకాన్ని రచించి విద్యార్థులకు అందించి 14 సంవత్సరాలుగా పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణతను సాధించేలా కృషి చేస్తున్నాను.
– బల్వంత్‌రావు, హిందీ ఉపాధ్యాయుడు,
మోడల్‌స్కూల్, ఎల్లారెడ్డి
హిందీ బోధించడంలో దిట్ట
Comments
Please login to add a commentAdd a comment