అ‘పూర్వ’ సమ్మేళనం
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండలంలోని సింగితం గ్రామ ప్రభుత్వ ఉన్నత పా ఠశాలలో ఆదివారం 2005–06 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థులందరూ ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో ఆప్యాయంగా మాట్లాడి, క్షేమ సమాచారం తెలుసుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకొని, చదువులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయులు కలకొండ. నారాయ ణ, లతీఫ్, దమ్ము వెంకటేశ్వర్లు, విజయ్ కుమా ర్, పాపారావు,శంకర్, రమేష్ కృష్ణప్రసాద్, పూ ర్వ విద్యార్థులు రవీ, సందీప్‌గౌడ్, వీరేశం, మ హందర్‌గౌడ్, రఫీ, దుర్గయ్య, శివకుమార్, కిర ణ్, శ్రీకాంత్, చిరంజీవి, నగేష్, అభిలేష్‌గౌడ్, దత్తయ్య, స్వరూప, శ్రీలత ఉన్నారు.
25 ఏళ్ల తర్వాత..
రామారెడ్డి: మండలంలోని రెడ్డిపేట గ్రామంలోగల మున్నూరుకాపు సంఘంలో ఆదివారం గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్ 1998–99 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈసందర్భంగా వారంతా ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో హర్షం వ్యక్తం చేశారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఆహ్వానించి, సన్మానించారు. ఆనాటి హెచ్‌ఎం వెంకట్ గౌడ్, ఉపాధ్యాయులు దత్తాద్రి, శంకరయ్య మాట్లాడుతూ.. అప్పటి చదువుకు, ఇప్పటి చదువుకు ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు. రెడ్డిపేట పాఠశాల చరిత్రలో మొట్టమొదటి ఆత్మీయ సమ్మేళనం అని ఆనందం వ్యక్తం చేశారు.
అ‘పూర్వ’ సమ్మేళనం
Comments
Please login to add a commentAdd a comment