కులగణనలో వివరాలు నమోదు చేసుకోవాలి
బాన్సువాడ రూరల్/నస్రుల్లాబాద్: ఇటీవల చేపట్టిన కులగణనలో వివరాలు నమోదు చేయించుకోలేని వారు ఈనెల 16 నుంచి 28 వరకు నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు బాన్సువాడ ఎంపీడీవో బషీరుద్దీన్, నస్రుల్లాబాద్ ఎంపీడీవో సూర్యకాంత్‌లు వేర్వేరు ప్రకటల్లో తెలిపారు. ప్రజాపాలన కేంద్రాలు, సిటిజన్ సర్వీస్ ద్వారా వివరాలు నమోదు చేయించుకోవాలన్నారు. గతంలో వివరాలు అందించని వారు మాత్రమే దరాఖాస్తు చేసుకోవాలని కోరారు.
ప్రారంభమైన
రెండో విడత కులగణన
లింగంపేట(ఎల్లారెడ్డి): స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన కులగణన రెండో విడత సర్వే వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నట్లు ఎంపీడీవో నరేష్ తెలిపారు. గత సర్వేలో పాల్గొనని వారి కోసం ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే గ్రామాల్లోకి వచ్చే ఎన్యూమరేటర్లకు తమ కుటుంబ వివరాలు తెలియజేయాలని కోరారు.
వాహనాల తనిఖీ
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ముస్తాపూర్ గ్రామ సమీపంలో ఆదివారం ఏఎస్సై ప్రకాశ్ నాయక్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. 20 మందికి జరిమానాలు విధించారు. వాహన చోదకులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. అలాగే ప్రతీ ఒక్కరూ వాహన ధ్రువపత్రాలు వెంట ఉంచుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుకు పంపుతామన్నారు.
ప్రయోగ పరీక్ష కేంద్రాల తనిఖీ
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ, ప్ర యివేటు జూనియర్ కళాశాలల్లో మూడో స్పెల్ ప్రయోగ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.ఆదివారం పలు ప్రయోగ పరీక్ష కేంద్రాలను జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి రవికుమార్ తనిఖీ చేశారు.ప్రతి పరీక్ష కేంద్రంలో కెమెరాలు పనిచేస్తున్న విషయాన్ని స్వయంగా ఇంటర్ విద్యాశాఖ అధికారి, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు పరిశీలించి సమీక్షించారు.
కులగణనలో వివరాలు నమోదు చేసుకోవాలి
Comments
Please login to add a commentAdd a comment