వృక్షార్చనను విజయవంతం చేయండి
బాన్సువాడ రూరల్: మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా సోమవారం నిర్వహించే వృక్షార్చన కార్యక్రమంలో ప్రజలు, పార్టీ నాయకులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు షేఖ్ జుబేర్ కోరారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా కేసీఆర్ పుట్టిన రోజున ప్రతి ఒక్కరు 3 మొక్కలు నాటి సెల్ఫీని 9177916838 నెంబర్‌కు వాట్సాప్ చేయాలని కోరారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా ముందస్తుగా ఆదివారం బాన్సువాడలో ఆపార్టీ నేతలు షేఖ్ జుబేర్.. చర్చిలో కేక్ కట్ చేశారు. క్రైస్తవ సోదరులతోకలిసి చర్చి ప్రాంగణంలో మొక్కలు నాటారు.
కామారెడ్డిలో..
కామారెడ్డి క్రైం: కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను కామారెడ్డిలో సోమవారం ఘనంగా నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్ పట్టణ అద్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ మాజీ విప్ గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో ఉదయం 10.30 గంటలకు ఆయన నివాసం వద్ద ఈ వేడుకులు ఉంటాయన్నారు.
తాడ్వాయిలో..
తాడ్వాయి/ఎల్లారెడ్డిరూరల్: కేసిఆర్ పుట్టిన రోజు సందర్భంగా తాడ్వాయి పల్లెప్రకృతి వనంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఆలోచన వల్లనే తాడ్వాయి గుట్టపైన పల్లెప్రకృతి వనం ఒక అడవిలా రూపు దిద్దుకుందన్నారు. ఆయన వెంట సింగిల్ విండో చైర్మన్ కపిల్‌రెడ్డి, మాజీ వైస్‌ఎంపీపీ నర్సిములు, తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి మండల కేంద్రంలో నిర్వహించే కేసీఆర్ జన్మదిన వేడుకలలో పాల్గొనేందుకు మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ రానున్నట్లు బీఆర్‌ఎస్ నాయకులు ఆదివారం తెలిపారు.
వృక్షార్చనను విజయవంతం చేయండి
Comments
Please login to add a commentAdd a comment