స్థలం విషయంలో వివాదం
తాడ్వాయి (ఎల్లారెడ్డి): దేమికలాన్‌లో రెండు ఇళ్ల మధ్య స్థలం విషయంలో వివాదం చెలరేగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. వివరాలు.. దేమికలాన్ గ్రామానికి చెందిన పురం లక్ష్మీపతి(42), మంగళి రాజయ్యలకు మధ్య స్థలంలో విషయంలో ఆదివారం మాటామాట పెరిగి గొడవ పెద్దగా తయారైంది. దీంతో రాజయ్య కోపంతో కర్రతో లక్ష్మీపతిని కొట్టడానికి ప్రయత్నించాడు. దీంతో లక్ష్మీపతికి అకస్మాత్తుగా గుండెనొప్పి వచ్చి కిందపడిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు అపస్మారక స్థితిలో ఉన్న లక్ష్మీపతిని కామారెడ్డిలోని ఓ ప్రవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. లక్ష్మీపతి మృతికి కారకుడైన రాజయ్యపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయంచేయాలని కోరుతూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తాడ్వాయి పోలీసుస్టేషన్‌కు తరలి వచ్చారు. లీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పెనుగులాటలో
ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి
న్యాయం చేయాలని కోరుతున్న
దేమికలాన్ గ్రామస్తులు
Comments
Please login to add a commentAdd a comment