విషాదాన్ని మిగిల్చిన రోడ్డు ప్రమాదం
మోర్తాడ్(బాల్కొండ): నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని తిమ్మాపూర్‌లో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బైక్‌పై వెళ్లిన ఇద్దరు స్తంభాన్ని ఢీకొని అక్కడికక్కడే మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి. తిమ్మాపూర్‌కు చెందిన సోహెల్(26) బతుకుదెరువు కోసం బహ్రెయిన్ వెళ్లి, రెండు రోజుల క్రితం సొంతూరుకు వచ్చాడు. అతడిని, కుటుంబ సభ్యులను కలవడంకోసం సమీప బంధువు జగిత్యాల జిల్లా యూసుఫ్‌నగర్‌కు చెందిన మహమ్మద్ సుమేర్(21) తన బైక్‌పై తిమ్మాపూర్‌కు వచ్చాడు. ఈ క్రమంలో సోమవారం సోహెల్, సుమేర్ ఇద్దరు కలిసి బైక్‌పై పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి వస్తుండగా ప్రమాదవశాత్తు స్తంభాన్ని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న భీమ్‌గల్ సీఐ సత్యనారాయణ, మోర్తాడ్ ఎస్సై విక్రమ్ ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు.
భార్య, కూతురును చూడకుండానే..
సోహెల్ భార్య ఆర్మూర్ మండలం మామిడిపల్లిలోగల తన తల్లి వద్ద ఉంటోంది. నాలుగు రోజుల క్రితమే కూతురు మొదటి పుట్టిన రోజు జరిగింది. రెండు రోజుల క్రితం బహ్రెయిన్‌నుంచి వచ్చిన సోహెల్.. త్వరలోనే భార్య, కూతురును ఇంటికి తీసుకువెళ్లాలనుకున్నాడు. అంతలోనే రోడ్డు ప్రమాదం జరిగి భార్య, కూతురును చూడకుండానే సోహెల్ మృతిచెందాడు.
స్తంభాన్ని ఢీకొన్న బైక్.. ఇద్దరి మృతి
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు..
ఇందల్వాయి: మండల కేంద్రంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొని ఎల్లారెడ్డిపల్లె గ్రామానికి చెందిన వేముల గంగాధర్(55) మృతి చెందినట్లు ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు. మండల కేంద్రంలోని ఓ వాటర్ ప్లాంట్‌లో పని చేస్తున్న గంగాధర్ పని ముగించుకొని హోటల్‌కి వెళుతుండగా ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించామని, మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
విషాదాన్ని మిగిల్చిన రోడ్డు ప్రమాదం
విషాదాన్ని మిగిల్చిన రోడ్డు ప్రమాదం
విషాదాన్ని మిగిల్చిన రోడ్డు ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment