విద్యార్థులకు ప్రజ్ఞోత్సవ పోటీలు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గోపాల్‌పేట కాంప్లెక్స్ స్కూల్‌లో సోమవారం వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ప్రజ్ఞోత్సవ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కథలు చెప్పడం, చదవడం, రాయడం, పద్యాలు చెప్పడం, చతుర్విద ప్రక్రియలపై విద్యార్థులకు పోటీలు పెట్టారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు కాంప్లెక్స్ హెచ్‌ఎం వెంకట్రాంరెడ్డి చేతులమీదుగా బహుమతులను ప్రదానం చేశారు. కాంప్లెక్స్‌స్కూల్ సెక్రెటరీ మాణిక్యమ్మ, రిసోర్స్ పర్సన్ కిష్టయ్య, సీఆర్పీ రాజయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment