కలుషిత నీరు తాగి తొమ్మిది మేకలు మృతి
మాచారెడ్డి: కలుషిత నీటిని తాగి తొమ్మిది మేకలు మృతిచెందిన ఘటన సోమవారం మండలంలోని లచ్చాపేటలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుల్లె దేవయ్యకు చెందిన మేకలు గ్రామ శివారులోని రైస్‌మిల్లు సమీపంలో మేస్తుండగా, రైస్‌మిల్లు నుంచి వెలువడిన కలు షిత నీటిని తాగాయి. దీంతో మేకలు అక్కడికక్కడే మృతిచెందినట్టు బాధితుడు తెలిపారు. ఈమేరకు పశువైద్యాధికారితో పోస్టుమార్టం చేయించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు బాధితుడు తెలిపారు. చనిపోయిన మేకల విలువ సుమారు రూ.2లక్షల వరకు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment