విద్యుత్ అధికారుల పొలంబాట
లింగంపేట(ఎల్లారెడ్డి): వ్యవసాయ బోరుబావుల వద్ద కెపాసిటర్లు బిగించుకోవాలని శెట్పల్లిసంగారెడ్డి ఏఈ హరీష్‌రావు సూచించారు. సోమవారం బోనాల గ్రామంలో విద్యుత్ అధికారులు పొలం బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కెపాసిటర్లు ఏర్పాటు చేసుకోవడం వల్ల కలిగే లాభాలు, విద్యుత్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. అలాగే వ్యవసాయ క్షేత్రాల్లో వంగిన స్తంభాలను సరిచేశారు. లైన్‌ఇన్‌స్పెక్టర్ కిష్టయ్య, లైన్‌మెన్లు అంబ్రియా, గంగాధర్, ఏఎల్‌ఎం రవీందర్, రాజు, జహీర్, నరేశ్, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment