కాలువలో పడి రైతు మృతి
బాల్కొండ: కాకతీయ కాలువలోని పంపుసెట్‌లో చెత్తను తొలగించడానికి నీటిలోకి దిగిన ఓ రైతు ప్రమాదవశాత్తు నీటమునిగి మృతిచెందాడు. ముప్కాల్ ఎస్సై రజనీకాంత్ తెలిపిన వివరాలు ఇలా.. ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన రైతు కోమటిశెట్టి చిన్నయ్య(46) కాకతీయ కాలువ నీటి ఆధారంగా పంపుసెట్ ఏర్పాటు చేసుకొని, ఆ నీటితో పొలం సాగుచేసేవాడు. పంపుసెట్‌లో చెత్త పేరుకుపోవడంతో తొలగించడానికి ఆదివారం సాయంత్రం అతడు ఇంటినుంచి బైక్‌పై బయలుదేరాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో సోమవారం ఉదయం అతడి కుటుంబ సభ్యులు కాలువ వద్దకు వెళ్లారు. అక్కడ అతడి బైక్ ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. వారు కాలువలో ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టగా సాయంత్రం చిన్నయ్య మృతదేహం లభ్యమైంది. చిన్నయ్య పంపుసెట్‌లోని చెత్తను తొలగించడానికి కాలువలోకి దిగి, ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.
చికిత్సపొందుతూ ఒకరు..
నిజాంసాగర్(జుక్కల్): చెట్టు పైనుంచి పడి గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన బేగరి లింగయ్య (31) ఆదివారం మేకలను మేత కోసం పంటపొలాల వైపు తీసుకువెళ్లాడు. ఈక్రమంలో అతడె పొలాల గట్టుపైన ఉన్న చింతచెట్టు ఎక్కి కొమ్మలను నరుకుతుండగా ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. తలకు బలమైన గాయాలు కావడంతో స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడినుంచి హైద్రాబాద్ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడి భార్య ఐశ్వర్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు.
తలమడ్లలో ఒకరు..
రాజంపేట: ఆత్మహత్యకు యత్నించిన ఓ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై పుష్పరాజ్ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని తలమడ్ల గ్రామానికి చెందిన కోదండమ్ సాయికుమార్(18) తూప్రాన్‌లో ఐటీఐ చదువుతున్నాడు. ఇటీవల తలమడ్ల గ్రామానికి వచ్చిన సాయికుమార్ శనివారం అకస్మాత్తుగా గడ్డిమందు తాగి, ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే కుటుంబసభ్యులు గమనించి అతడిని చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డిపేటలోని అశ్విని హాస్పిటల్‌కు తరలించారు. సోమవారం చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు. మృతికి గల కారణాలు తెలియలేదని విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు.
కాలువలో పడి రైతు మృతి
Comments
Please login to add a commentAdd a comment