ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి
కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 58 ఫిర్యాదులు వచ్చాయి. రెవెన్యూ సమస్యలు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, రైతు భరోసా, వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన వినతులు ఎక్కువగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన వినతులను పరిశీలించి సత్వర చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ వి.విక్టర్, జెడ్పీ సీఈవో చందర్ నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
క్షేత్రస్థాయిలో పర్యటించాలి..
జిల్లా, మండల స్థాయి అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించాలని కలెక్టర్ సంగ్వాన్ సూచించారు. ప్రజావాణి అనంతరం అధికారులతో సమావేశమై మాట్లాడారు. అధికారులు తమ శాఖలకు సంబంధించిన పనులను పర్యవేక్షించాలన్నారు. అధికారులు, సిబ్బందితో సమీక్షలు నిర్వహించాలని సూచించారు. ఎల్‌ఆర్‌ఎస్, ధరణి ఫిర్యాదులపై తహసీల్దార్లు చర్యలు చేపట్టాలని సూచించారు. ఆస్తి పన్నుల వసూళ్లు, పారిశుధ్యం, నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకం లాంటి పనులను ఎంపీడీవోలు నిరంతరంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొనని కుటుంబాల వివరాలు ఈ నెల 28 వరకు ఎంట్రీ చేసుకునేలా ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించిందని తెలిపారు. ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లోని ప్రజాపాలన సేవా కేంద్రాల్లో పూర్తి వివరాలు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 040 21111111 కు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోగా ఫోన్ చేసి కుటుంబ వివరాలు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
ప్రజావాణికి 58 వినతులు
Comments
Please login to add a commentAdd a comment